హృతిక్ రోషన్ ఈ ఏడాది నటించిన ‘మొహెంజదారో’ డిజాస్టర్ అయింది. అయినప్పటికీ అతడికి రావాల్సిన ఆదాయం భారీగానే వచ్చినట్లుంది. అలాగే తన కొత్త సినిమా ‘కాబిల్’కు కూడా భారీగానే పారితోషకం అందుకున్నట్లున్నాడు. అలాగే ప్రకటనల ఆదాయానికీ ఢోకా లేనట్లుంది. ఈ వార్షిక సంవత్సరానికి రికార్డు స్థాయిలో రూ.80 కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ కట్టడం విశేషం. ఈ ఏడాది అత్యధిక అడ్వాన్స్ ట్యాక్స్ కట్టిన సెల్రబెటీ అతనే కావడం విశేషం. ఖాన్ త్రయం హృతిక్ వెనకే ఉంది. గత ఏడాది రూ.50 కోట్ల ట్యాక్స్ కట్టిన హృతిక్ ఈ ఏడాది మూడో క్వార్టర్ ముగిసేసరికే ఇంకో 30 కోట్లు అదనంగా ముందస్తు పన్ను కట్టడం విశేషం.
అమీర్ ఖాన్ ఎప్పట్లాగే భారీగా పన్ను కడుతున్నాడు. అతను రూ.72 కోట్ల ముందస్తు పన్నుతో హృతిక్ రోషన్ తర్వాతి స్థానంలో నిలిచాడు. అతను గత ఏడాది ఇదే క్వార్టర్లో రూ.34 కోట్ల పన్ను మాత్రమే కట్టడం విశేషం. హృతిక్.. అమీర్ తర్వాత రణబీర్ కపూర్ మూడో స్థానంలో నిలవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. గత ఏడాది మూడో క్వార్టర్లో రూ.9 కోట్లు మాత్రమే పన్ను కట్టిన రణబీర్.. ఈ ఏడాది ఏకంగా రూ.37 కోట్లు చెల్లించడం విశేషం. ‘సుల్తాన్’తో కెరీర్ బెస్ట్ హిట్టు కొట్టిన సల్మాన్ ఖాన్ రూ.14 కోట్లు మాత్రమే ముందస్తు పన్ను కట్టాడు. అతను గత ఏడాది రూ.10 కోట్లు చెల్లించాడు. అక్షయ్ కుమార్ రూ.10 కోట్ల ముందస్తు పన్నుతో తర్వాతి స్థానంలో ఉన్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/