వివాదాలన్నీ ఒకేలా ఉండవు. కొన్ని వివాదాల్ని ఎంత తొందరగా క్లోజ్ చేసుకుంటే అంత మంచిది. కొన్నిసార్లు ఏముందిలే అనుకున్నవే నెత్తికి చుట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందులోకి కోర్టు నుంచి వచ్చే సమన్లకు న్యాయబద్ధంగా స్పందిస్తేనే మంచిది. కానీ.. చాలా సందర్భాల్లో ప్రముఖులు కోర్టు ఆదేశాల విషయంలో జాగ్రత్తలు తీసుకోకుండా.. విషయం మరింత సీరియస్ గా అయ్యేలా చేసుకుంటుంటారు.
తాజాగా బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్ తీరు అలానే ఉందన్న మాట వినిపిస్తోంది. తాను రాసిన చచ్చేంత ప్రేమ నవలను కాపీ కొట్టి శ్రీమంతుడు సినిమా నిర్మించారని కొద్దిరోజులుగా ఒక వివాదం కోర్టులో నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఆ చిత్ర దర్శకుడు.. కొరటాల శివకు.. హీరో మహేశ్ బాబుకు సమన్లు అందాయి. ఈ వివాదం ఇలా నడుస్తుంటే.. మరోవైపు ఈ సినిమాను హిందీలో తీసేందుకు వీలుగా బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన హృతిక్ రోషన్ సన్నాహాలు చేస్తున్నారంటూ రచయిత శరత్ చంద్ర సిటీ సివిల్ కోర్టులో పిటీషన్ వేశారు.
ఈ పిటీషన్ పై తాజాగా విచారణ చేపట్టింది కోర్టు. పిటీషనర్ దాఖలు చేసిన దరఖాస్తుకు వివరణ ఇవ్వాలంటూ గతంలో రెండుసార్లు సమన్లు ఇచ్చినప్పటికీ హృతిక్ రోషన్ స్పందించకపోవటంతో తాజాగా మరోసారి సమన్లు జారీ చేసింది. మరోవైపు ఇదే ఉదంతానికి సంబంధించి లిఖిత పూర్వక వాంగ్మూలం నమోదు చేసుకోవటానికి కోర్టుకు హాజరు కావాలని దర్శక నిర్మాతల్ని పలుమార్లు ఆదేశించినప్పటికీ వారు స్పందిచలేదు. దీంతో.. వారు వాదనలు వినిపించే అవకాశాన్ని రద్దు చేస్తూ కొరటాల శివ.. ఎర్నేని శివలకు ఎక్స్ పార్టే ఉత్తర్వులు జారీ చేసింది. మరీ.. వివాదం రానున్న రోజుల్లో మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.