వామ్మో.. మహేష్ సినిమాకు అంతా?
సౌత్ ఇండియన్ హీరోల్లో మహేష్ బాబు చాలా స్పెషల్. మిగతా స్టార్ హీరోల మార్కెట్ వాళ్ల సినిమాల ఫలితాల్ని బట్టి పెరగడం.. తగ్గడం జరుగుతుంటుంది. కానీ మహేష్ బాబు సంగతి అలా కాదు. అతడి లేటెస్ట్ మూవీ పెద్ద డిజాస్టర్ అయినా సరే.. తర్వాతి సినిమా బడ్జెట్.. మార్కెట్ రెండూ పెరిగిపోతాయి. 1 నేనొక్కడినే.. ఆగడు లాంటి డిజాస్టర్ల తర్వాత కూడా ‘శ్రీమంతుడు’ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరగడమే కాదు.. రికార్డు కలెక్షన్లూ వచ్చాయి. ఇక లేటెస్టుగా ‘బ్రహ్మోత్సవం’ లాంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ తగిలినా సరే.. ఆ ప్రభావం మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ చేస్తున్న తర్వాతి సినిమా మీద పడలేదు. ఈ సినిమాకు కళ్లు చెదిరే బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి.
‘బాహుబలి’ లాంటి అసాధారణ చిత్రాలకు మాత్రమే సాధ్యమైన ఫిగర్లు ఇప్పుడు మహేష్ సినిమాకు కూడా కనిపిస్తున్నాయి. మహేష్-మురుగ సినిమా నైజాం హక్కులు ఏకంగా రూ.26 పలుకుతున్నట్లు సమాచారం. ఇటీవలే ‘బాహుబలి’ నైజాం హక్కుల్ని దాదాపు రూ.50 కోట్లు పెట్టి కొన్నట్లు చెబుతున్న ఏషియన్ సినిమాస్ సంస్థ మహేష్ సినిమాకు ఈ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు అసలు ఊహించని రేటు పలుకుతున్నాయి. తమిళ వెర్షన్ కు కూడా కలిపి రూ.25 కోట్లు పలుకుతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా శాటిటైల్ హక్కుల్ని రూ.16 కోట్లకు జీ తెలుగు ఛానెల్ కు అమ్మేశారు. అన్ని లెక్కలూ కలుపుకుంటే ఈ సినిమా బిజినెస్ రూ.150 కోట్ల మార్కును ఈజీగా దాటిపోయేలా కనిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/