ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి 9 విడుదలకు సిద్ధమవుతుండగానే నిర్మాత బాలకృష్ణ అండ్ టీమ్ కు కామధేనువుగా మారుతోంది. ట్రైలర్ వచ్చాక బిజినెస్ పరంగా కూడా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. బాలకృష్ణకు ఫ్యాన్ బేస్ బలంగా ఉన్న ఏరియాల నుంచి కనివిని ఎరుగని ఆఫర్లతో డిస్ట్రిబ్యూటర్లు అడ్వాన్స్ లతో వస్తున్నారట. ఇదిలా ఉండగా డిజిటల్ హక్కుల్లో కొత్త విప్లవం తెచ్చిన అమెజాన్ ప్రైమ్ ఎన్టీఆర్ మొదటి భాగం కథానాయకుడికి ఏకంగా 25 కోట్ల ఆఫర్ ఇచ్చిందట. తెలుగు తమిళ్ హింది బాషలకు గాను కాంబో ఆఫర్ లో ఈ మొత్తం వచ్చినట్టు సమాచారం. ఎలా చూసుకున్నా ఇది సూపర్ ఆఫర్ అనే చెప్పొచ్చు.
ఇంకా శాటిలైట్ డీల్స్ క్లోజ్ కాలేదు. అదీ కలుపుకుంటే ఒక్క కథానాయకుడే 45 కోట్ల దాకా సొమ్ములు తెచ్చి పెట్టేలా ఉన్నాడు. అంటే ముప్పాతిక శాతం పెట్టుబడి ఈ రూపంలో వెనక్కు వచ్చేసినట్టే. థియేట్రికల్ రైట్స్ కలిపితే ఎంతవుతుందో చెప్పనక్కర్లేదు. అయితే కథానాయకుడుకు ఇంత వచ్చింది మరి మహానాయకుడు పరిస్థితి ఏంటి అనే సందేహం కలగవచ్చు. దానికి ఇంకొంత సమయం పట్టేలా ఉంది.
మహానాయకుడు పూర్తి సీరియస్ గా సాగే కథతో పాటు రాజకీయ నేపధ్యం కనక ఇంత రేట్ రాకపోవచ్చు అనే అనుమానాలు ఉన్నాయి. కొంత తగ్గొచ్చు కాని మరీ ఎక్కువ తేడా ఉండకపోవచ్చు. బాలకృష్ణ అభిమానులు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఎన్టీఆర్ విడుదలకు ముందే ఇంత సేఫ్ వెంచర్ గా మిగలడం అంటే మాములు విషయం కాదుగా. సంక్రాంతి రేస్ ని మొదలుపెట్టబోతున్న ఎన్టీఆర్ కథానాయకుడు బెనిఫిట్ షోలకు ప్లానింగ్ జరిగిపోయిందని సమాచారం.