డ‌జ‌ను సినిమాల‌కు థియేట‌ర్లు స‌రిపోయాయా?

Update: 2021-03-05 04:53 GMT
వారానికి మూడు నాలుగు సినిమాలు పోటీప‌డితేనే థియేట‌ర్లు చాల్లేద‌ని గ‌డబిడ క‌నిపిస్తుంటుంది. ఆ న‌లుగురు.. సిండికేట్! అంటూ బోలెడంత ర‌చ్చకు చిన్న నిర్మాత‌లు రెడీ అవుతుంటారు. కానీ క్రైసిస్ స‌మ‌యంలో వాయిదా ప‌డి ఇప్పుడు ఏకంగా 11-12 సినిమాలు తెర‌పైకొస్తున్నాయి. ఇవ‌న్నీ ఈ శుక్ర‌వారం రిలీజ్ కి రావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

2021 ఆరంభ‌మే టాలీవుడ్ లో మాంచి ఊపు క‌నిపించింది. ప్ర‌తి శుక్ర‌వారం మూడు నాలుగు చిత్రాలు రిలీజ‌వుతున్నాయి. క్రాక్ ఘ‌న‌విజ‌యంతో హుషారు పెరిగింది. ఉప్పెన ఆ ఊపును ప‌దింత‌లు పెంచింది. నాంది- జాంబిరెడ్డి లాంటి చిత్రాలు ‌విజ‌యం సాధించ‌డంతో ప‌రిశ్ర‌మ‌లో హుషారు మ‌రింత‌ పెరిగింది. ఈ వారాంతంలో ఏకంగా డ‌జ‌ను సినిమాలు రిలీజ‌వుతున్నాయ‌న్న‌ది టాక్.  జీ ప్లెక్స్ లో నేరుగా ప్రసారానికి ఓ సినిమా సిద్ధ‌మైంది.

ఈ ఫ్రైడే రిలీజ్ ల‌ జాబితా ప‌రిశీలిస్తే .. రెండు మూడు క్రేజీ చిత్రాలు కూడా ఉన్నాయి. సుందీప్ కిషన్ స్పోర్ట్స్ డ్రామా `ఏ1 ఎక్స్ ప్రెస్`.. రాజ్ తరుణ్ పవర్ ప్లే.. దిల్ రాజు నిర్మించిన `షాది ముబారక్`.. ఈ డ‌జ‌ను సినిమాల్లో ఉన్నాయి. ప్లే బ్యాక్ - ఎ- విక్రమార్కుడు- గజ కేసరి- దేవినేని- క్లైమాక్స్- శ్రీ పరమానంద శిష్యుల కథ- తోట బావి చిత్రాలు ఈ శుక్ర‌వారం రిలీజ‌వుతున్నాయి. ఇన్ని సినిమాలు రిలీజ‌వుతున్నాయి అంటే అన్నిటికీ థియేట‌ర్ల‌ను స‌ర్ధుబాటు చేయాలి. ప్రైమ్ ఏరియాల్లో థియేట‌ర్లు ద‌క్క‌క‌పోతే ఆ మేర‌కు వ‌సూళ్లు స‌రిగా లేవ‌న్న ఆరోప‌ణ‌లు ఉంటాయి. మ‌రి ఇన్ని వ‌చ్చినా ఎలా స‌ర్ధుబాటు చేశారు? అన్న‌దే ఇప్పుడు హాట్ టాపిక్. ఇక వీళ్లంద‌రిలో విజేత‌లు ఎంద‌రు అన్న‌దానికి కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది.
Tags:    

Similar News