పాపం సూర్య - కథ క్లైమాక్స్ కేనా

Update: 2019-06-01 09:52 GMT
నిన్న విడుదలైన ఎన్జికె యునానిమస్ డిజాస్టర్ వైపుగా దూసుకెళ్తోంది. సోషల్ మీడియాలో దీని మీద వస్తున్న ఫీడ్ బ్యాక్ చూస్తే సెల్వ రాఘవ దర్శకత్వం మానేసి వేరే వ్యాపారం చూసుకోవాల్సిందే. అంత దారుణంగా ఉన్నాయి కామెంట్స్. వీకెండ్ పుణ్యమా అని ఏదో కొంత వసూళ్లు వస్తున్నాయి కానీ సోమవారం చాలా చోట్ల అడిషనల్ స్క్రీన్స్ లో తీసేసేందుకు ఇప్పటికే ఎగ్జిబిటర్లు రెడీగా ఉన్నాయి.

నిజానికి పెద్దగా పోటీ లేకపోయినా సూర్య లాంటి రేంజ్ ఉన్న స్టార్ హీరో నటించినా ఎన్జికె ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టుకోలేదు. చాలా చోట్ల మార్నింగ్ షో నిండటం కష్టమైపోయింది. ఇక మౌత్ టాక్ రివ్యూస్ అన్ని ప్రతికూలంగా ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో వేరే చెప్పాలా. అది ఎన్జికె ప్రత్యక్షంగా అనుభవిస్తోంది

ఒకప్పుడు తెలుగులో మంచి మార్కెట్ ఉన్న సూర్యకు ఇలాంటి పరిస్థితి రావడం విచిత్రమే. ఇప్పటికే బిజినెస్ రేంజ్ బాగా పడిపోయింది. ఇకపై విక్రమ్ తరహాలో సూర్య డబ్బింగ్ సినిమా వస్తోంది అంటే బయ్యర్లు భయపడే లేదా తటపటాయించే సిచువేషన్ వచ్చేలా ఉంది. తన స్థాయి సక్సెస్ సూర్య సాధించి చాలా కాలం అయ్యింది. ప్రీ రిలీజ్ లో అతని నమ్మకం చూసి ప్రేక్షకులో కనీసం ఏదో ఉంటుందిలే అనుకుంటున్నారు.

ఇప్పుడు అంతా తారుమారు అయిపోయింది. సూర్య నెక్స్ట్ మూవీ కాప్పన్ ఇంకో మూడు నెలల్లో రానుంది. దాని మీద ఎన్జికె ప్రభావం చాలా గట్టిగా పడేలా ఉంది. తెలుగు వెర్షన్ కు సంబంధించిన హక్కులు ఇంకా అమ్మలేదు. మరి ఇప్పుడు ఎంత తక్కువకు అడుగుతారో ఊహించడం కష్టమే.పైగా లైకా ప్రొడ్యూసర్ కాబట్టి 2.0 తాలుకు నష్టాలు గుర్తుకురాక మానవు


Tags:    

Similar News