బాలీవుడ్ సినిమాలు రెండు వేల థియేటర్లలో విడుదల అవ్వడం అరుదుగా జరుగుతుంటుంది. సూపర్ స్టార్ సినిమాలు.. క్రేజీ ప్రాజెక్ట్ లు అయితేనే రెండు వేలకు పైగా థియేటర్లలో బాలీవుడ్ సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అలాంటిది వకీల్ సాబ్ సినిమా ఏకంగా 2175 థియేటర్లలో విడుదల అవ్వడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఇంత భారీ ఎత్తున విడుదల అవ్వడం సౌత్ సినిమా రికార్డుగా చెబుతున్నారు. రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ ను ఈ సినిమా దక్కించుకోవడం ఖాయం అనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు.
ఈ చిత్రంకు ఉన్న బజ్ నేపథ్యంలో అన్ని ఏరియాల్లో కూడా భారీ ఎత్తున విడుదల చేయడం జరిగింది. నైజాం ఏరియాలో ఈ సినిమాను 355 థియేటర్లలో విడుదల చేశారు. ఇక ఆంధ్రా లో 600+.. సీడెడ్ లో 220 థియేటర్లు.. రెస్టాఫ్ ఇండియా 300 స్క్రీన్స్ మరియు ఓవర్సీస్ లో 700 స్క్రీన్స్ లో సినిమాను విడుదల చేయడం జరిగింది. సౌత్ సినిమాలు ఓవర్సీస్ లో 700 లకు పైగా స్క్రీన్స్ లో విడుదల అవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఇదో రికార్డుగా చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ థియేటర్ల సంఖ్య చూస్తుంటే డే 1 కలెక్షన్స్ దుమ్ము లేచి పోవడం ఖాయం అనిపిస్తుంది.
ఇప్పటికే సినిమా పడింది. పలు చోట్ల నుండి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తుంది. ఇలాంటి సమయంలో అభిమానులు మొదటి రోజు వసూళ్లు ఏ రేంజ్ లో ఉంటాయా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2175 థియేటర్లలో బాలీవుడ్ సినిమాలను మించి విడుదల అయిన ఈ సినిమా పవన్ స్టామినాను చెప్పకనే చెప్పిందంటూ అభిమానులు మరియు మీడియా వర్గాల వారు అంటున్నారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే.