ఈ రోజుల్లో వీకెండ్ వసూళ్లను బట్టి ఏ సినిమానూ అంచనా వేయడానికి వీల్లేదు. ఒకేసారి ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేయడం.. రిలీజ్ ముంగిట హైప్ క్రియేట్ చేయడం వల్ల ఓపెనింగ్స్ బాగానే ఉంటున్నాయి. కానీ సినిమా అసలు ఫలితం ఏంటో తెలియాలంటే సోమవారం వసూళ్ల లెక్కలు చూడాలి. ఆ రోజు కలెక్షన్లు స్టడీగా ఉంటే సినిమా గట్టెక్కేసినట్లే. ఈ విషయంలో రామ్ మూవీ ‘ఉన్నది ఒకటే జిందగీ’ తేలిపోయింది. ఫస్ట్ వీకెండ్లో రూ.11 కోట్ల దాకా షేర్ రాబట్టడంతో ఈ సినిమా హిట్ కేటగిరీలోకి చేరుతుందని అనుకున్నారంతా. కానీ సోమవారం ఈ సినిమా నిలబడలేకపోయింది.
వీకెండ్ అవ్వగానే ‘ఉన్నది ఒకటే జిందగీ’ వసూళ్లలో పెద్ద డ్రాప్ కనిపించింది. మంగళ-బుధవారాల్లో కూడా పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదు. దీంతో ఈ సినిమా అంతిమంగా ఫ్లాప్ అని తేలేలా ఉంది. వీకెండ్లో సగం దాకా బయ్యర్ల పెట్టుబడిని వెనక్కి తెచ్చిన ‘జిందగీ’.. ఇంకో సగం రాబట్టాలంటే ఈ వారమంతా కూడా బాగా పెర్ఫామ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. కానీ వీక్ డేస్ లో బాగా వీక్ అయిపోయిన ఈ చిత్రం.. శుక్రవారం ఒకటికి మూడు కొత్త సినిమాలు రిలీజవుతున్న నేపథ్యంలో ఆ పోటీని తట్టుకుని ఏమాత్రం వసూళ్లు రాబడుతుందన్నది సందేహమే. అందులో ఒకట్రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా ‘ఉన్నది ఒకటే జిందగీ’ పనైపోయినట్లే. కనీసం 25 శాతం నష్టాల్ని బయ్యర్లు బేర్ చేయకతప్పదేమో.