అశ్లీల చిత్రాల కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో సినిమా చాన్స్ ల కోసం వచ్చిన వారికి ఆఫర్లు ఇచ్చిన ఈ అశ్లీల చిత్రాలను తీసి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో విడుదల చేశాడన్నది రాజ్ కుంద్రాపై వచ్చిన ప్రధాన ఆరోపణగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 19న పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. ఈనెల 27వరకు కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది.
ఇక తన అవ్లీల చిత్రాలన్నింటిని హాట్ షాట్ యాప్ లో రాజ్ కుంద్రా అప్ లోడ్ చేయించాడని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు ఒక్క హాట్ షాట్ యాప్ ద్వారానే ఈయన ఏకంగా రూ.1.17 కోట్లు ఆర్జించాడని జాతీయ మీడియా పేర్కొంది.
ఈ క్రమంలోనే ఈ ఆదాయానికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం రాబట్టడానికి ఆపిల్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ నుంచి పూర్తి వివరాలను కోరామని ముంబై పోలీసులు తెలిపారు.
రాజ్ కుంద్రా బెయిల్ పిటీషన్ ను ఇదివరకే కోర్టు కొట్టివేసింది. 14 రోజుల జ్యూడిషీయిల్ కస్టడీ విధించింది. అయితే ఈ విసయంపై హైకోర్టును రాజ్ కుంద్రా తరుఫున న్యాయవాదులు ఆశ్రయించారు.
ముంబైలోని అంధేరిలో ఉన్న వియాన్ అండ్ జేఎల్ స్ట్రీమ్ ఆఫీసులో క్రైమ్ బ్రాంచ్ అధికారులు సేకరించిన ఆధారాలతోనే అతడికి బెయిల్ రాలేదని అర్థమైంది. ఇందులో వాళ్లకు ఓ సీక్రెట్ కబోర్డ్ కనిపించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి జులై 19నే అక్కడి వాళ్లు వెతకగా ఇది కనిపించలేదు. ఈ నేపథ్యంలో రాజ్ కుంద్రాతో సంబంధం ఉన్న పలువురిని ప్రశ్నించడంతో వాళ్లు ఈ విషయాన్ని తెలిపినట్లు సమాచారం. ఆ సీక్రెట్ గా దాచిన కప్ బోర్డులో క్రైం బ్రాంచ్ అధికారులకు కీలక ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం.. పోలీసులకు లభ్యమైన వాటిలో ఎక్కువభాగం క్రిప్టో కరెన్సీకి సంబంధించిన పత్రాలే ఉన్నట్లు సమాచారం. వాటితోపాటు కేసుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు కూడా దొరికాయంటున్నారు. దీంతో కుంద్రా పుట్ట పెద్దదే అని పోలీసులు అంటున్నారు.
పత్రాలను ప్రస్తుతం పోలీసులు పరిశోధిస్తున్నారు. అందులో మోడళ్లు, హీరోయిన్లతో చేసుకున్న ఒప్పందాలకు సంబంధించిన వివరాలు ఏమైనా ఉన్నాయా? అన్న దిశగా వాళ్లు అన్వేషణ జరుపుతున్నారట.. అశ్లీల చిత్రాలకు సంబంధించిన ఆధారాలను ఇందులో వెతికే పనిలో పడ్డట్టు తెలుస్తోంది.