పవన్ కల్యాణ్ - రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ''భీమ్లా నాయక్''. మలయాళ సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియం’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్. ఇందులో పవన్ సరసన నిత్యా మీనన్.. రానా కు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రీమేక్ ప్రాజెక్ట్ అయినప్పటికీ పవన్ ఇమేజ్ కారణంగా సినిమాపై భారీ హైప్ ఏర్పడింది.
'భీమ్లా నాయక్' చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2022 జనవరి 12న విడుదల చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ - ఇద్దరు హీరోల ఇంట్రో టీజర్లు - ఎస్ ఎస్ థమన్ స్వరపరిచిన రెండు పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అందుకే ఈ సినిమా డిజిటల్ రైట్స్ కు మంచి డిమాండ్ ఏర్పడింది. థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఈ చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీ విడుదలకు ఇస్తే అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ భారీ ఆఫర్ ఇవ్వడానికి రెడీగా ఉందని టాక్ వినిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ - రానా కలసి నటిస్తున్న ఈ సినిమాని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయడానికి అమెజాన్ ప్రైమ్ వీడియో 150 కోట్లకు పైగా చెల్లించడానికి ముందుకు వచ్చిందంట. అమెజాన్ వారు 'వకీల్ సాబ్' మూవీ రైట్స్ కు చెల్లించిన దాంతో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువే అని చెప్పాలి. కాకపోతే పవన్ సినిమా క్లిక్ అయితే బాక్సాఫీస్ వద్ద ఈజీగా వంద కోట్ల షేర్ వసూలు చేస్తుంది. ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులు ఎలాగూ అర కోటికి అమ్ముడు పోయే అవకాశం ఉంది.
భారీ అంచనాల మధ్య రూపొందుతున్న 'భీమ్లా నాయక్' సినిమా బాగుంటే మాత్రం అన్నీ కలుపుకుని నిర్మాతలు లాభాల్లోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డైరెక్ట్ విడుదల కోసం ఓటీటీ వారిచ్చే బంఫర్ ఆఫర్ కు మేకర్స్ ముగ్గు చూపకపోవచ్చు. ఇది వరకే పవన్ సినిమాని నేరుగా డిజిటల్ రిలీజ్ చేస్తున్నారని వచ్చిన వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ 'సంక్రాంతి రిలీజ్' అని క్లారిటీ ఇచ్చారు. విడుదలకు ఇంకా చాలా టైం ఉంది. మరి ఈ గ్యాప్ లో ఓటీటీ డీల్ గురించి ఏమైనా ఆలోచిస్తారేమో చూడాలి.
కాగా, 'భీమ్లా నాయక్' చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సాగర్ కె చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దీనికి స్క్రీన్ ప్లే - మాటలు అందిస్తున్నారు. రవి కె చంద్రన్ సినిమాటోగ్రాఫర్ గా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.