సినిమా తీయడం ఒకెత్తు అనుకుంటే బిజినెస్ పూర్తి చేయడం మరో ఎత్తు. అండర్ ప్రొడక్షన్ ఉండగానే ప్రీ రిలీజ్ బిజినెస్ కి హైప్ రావాలంటే చాలా జిమ్మిక్కులే తెలియాలి. ఈ విషయంలో `ఓ బేబి` నిర్మాతలు పెద్ద సక్సెసయ్యారన్న ముచ్చట సాగుతోంది. అగ్ర నిర్మాత.. టాప్ డిస్ట్రిబ్యూటర్ కం ఎగ్జిబిటర్ డి.సురేష్ బాబు అండదండలతో ఓ బేబి ప్రీరిలీజ్ బిజినెస్ స్టంట్ పెద్ద హిట్టయ్యిందని తాజా గణాంకాలు చెబుతున్నాయి.
ట్రేడ్ వివరాల ప్రకారం.. ఈ సినిమాని 13 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఓవర్సీస్ హక్కులకు రూ.1.75 కోట్లు.. కర్ణాటక హక్కుల రూపంలో 75 లక్షలు దక్కాయి. డిజిటల్ రిలీజ్ ని నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. డిజిటల్ రూపంలో రూ.3 కోట్లు.. శాటిలైట్ రూపంలో మరో రూ.2 కోట్లు వచ్చాయి. హిందీ డబ్బింగ్ రైట్స్ పేరుతో మరో 3 కోట్లు గిట్టుబాటు అయ్యిందని తెలుస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల రిలీజ్ హక్కులు సురేష్ ప్రొడక్షన్స్ ఖాతాలోనే నిక్షిప్తంగా ఉన్నాయి. అంటే పెట్టిన పెట్టుబడి రకరకాల మార్గాల్లో వచ్చేస్తే .. తెలుగు రాష్ట్రాల రిలీజ్ హక్కుల రూపంలో లాభాలు కళ్లజూడబోతున్నారన్నమాట.
అక్కినేని సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఓ బేబి మూడు బ్యానర్లపై తెరకెక్కింది. సురేష్ ప్రొడక్షన్స్ - పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ- గురు ఫిలింస్& క్రాస్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. జూలై 5న సినిమా రిలీజవుతోంది. ఇక ఓ బేబి బిజినెస్ లో మరో ఆసక్తికరమైన ట్విస్టు ఉంది. సినిమాకి ఎంతో కీలకమైన ప్రమోషన్ సహా రిలీజ్ మ్యాటర్స్ అన్నీ డి.సురేష్ బాబు చూసుకుంటారు కాబట్టి ఆయనకే ఏపీ-నైజాం రైట్స్ చెందుతాయని తెలుస్తోంది. మొత్తానికి ఓ లాభదాయకమైన వెంచర్ ని తీర్చిదిద్దడంలో పెద్దన్న సురేష్ బాబు నైపుణ్యం మరోసారి ప్రూవైందన్న ముచ్చటా పరిశ్రమలో సాగుతోంది.