శర్వానంద్ హీరోగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా కిశోర్ రెడ్డి దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో రామ్ మరియు గోపీలు నిర్మించిన శ్రీకారం ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉంది. ఈ సినిమాను లాక్ డౌన్ కు ముందే దాదాపుగా పూర్తి చేశారు. గత ఏడాది సమ్మర్ లో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కాని కరోనా కారణంగా వాయిదా పడింది. శర్వానంద్ వరుస ప్లాప్ ల కారణంగా ఈ సినిమా ను జనాలు మొన్నటి వరకు పెద్దగా పట్టించుకోలేదు. కాని విడుదల రెండు వారాలు ఉండగా మొదలైన సందడితో సినిమాకు భారీగా బిజినెస్ జరుగుతోంది.
శ్రీకారం సినిమా ట్రైలర్ ఆలోచింపజేసే విధంగా ఉండటంతో పాటు సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొనడం చరణ్ వంటి స్టార్ ఈ సినిమా పై ప్రశంసలు కురిపించడం వంటి కారణంగా అన్ని ఏరియాల్లో కూడా సాలిడ్ రేటుకు అమ్ముడు పోయినట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. నైజాం ఏరియాలో దాదాపుగా 5.75 కోట్ల రూపాయలకు ఈ సినిమా అమ్ముడు పోయిందట. ఇక సీడెడ్ లో రూ.2.4 కోట్లు ఆంధ్రాలో రూ.8 కోట్లకు అమ్ముడు పోయినట్లుగా సమాచారం అందుతోంది. దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో 16 కోట్లకు పైగా ఈ సినిమా బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. చివరి నిమిషంలో వచ్చిన బజ్ తో నిర్మాతలకు టేబుల్ ఫ్రాఫిట్ దక్కింది. ఇక సినిమా బ్రేక్ ఈవెన్ ను సాధిస్తుందా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుంది అనేది చూడాలి.