దేశంలో అత్యంత ఆదరణతో గొప్ప ఫాలోవర్స్ ని కలిగి ఉన్న కథానాయికగా ఆలియా భట్ పేరు మార్మోగుతోంది. కోట్లాదిగా ఫాలోవర్స్ ఆలియాను సోషల్ మీడియాల్లో అనుసరిస్తున్నారు. కేవలం ఇన్ స్టా వేదికపై 6.5కోట్ల మంది అనుచరులున్నారు. దీంతో డిజిటల్ మీడియా ఆదాయంలో బాలీవుడ్ లో ఆలియా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.
ఆలియా సోషల్ మీడియా పోస్టింగ్ కోసం కోటి రూపాయలు వసూలు చేస్తుందని తెలిసింది. సోషల్ మీడియా యాడ్ లేదా పోస్ట్ కోసం రూ. 85 లక్షల నుండి కోటి వరకు వసూలు చేస్తుందని సమాచారం. ఇన్ ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ప్రకారం.. ఆలియా సోషల్ మీడియా ఆదాయం ఒక రేంజులో ఉందని తెలిసింది. 2021లో డఫ్ అండ్ ఫెల్ప్స్ కి చెందిన ప్రముఖ బ్రాండ్ వాల్యుయేషన్ నివేదిక ప్రకారం... ఆలియా బ్రాండ్ విలువ 68.1 మిలియన్ల డాలర్లుగా లెక్క తేలింది. ఆదాయ ఆర్జనలో టాప్ 10లో అతి పిన్న వయస్కురాలిగా రికార్డులకెక్కింది.
స్టార్ హీరో రణబీర్ కపూర్ ను ఆలియా ఏప్రిల్‌లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం జూన్ లో గర్భం దాల్చినట్లు ప్రకటించింది. డిసెంబర్ లో ప్రసవానికి డేట్ ఫిక్స్ అయ్యిందన్న టాక్ కూడా వినిపిస్తోంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే..అలియా ఇటీవల నెట్ ఫ్లిక్స్ విడుదల 'డార్లింగ్స్'లో కనిపించింది. ఈ చిత్రానికి సానుకూల సమీక్షలు వచ్చాయి. షారూక్ ఖాన్ తో కలిసి ఆలియా ఈ చిత్రాన్ని నిర్మించింది. తాను స్వయంగా ప్రధాన పాత్రను పోషించింది. తదుపరి బ్రహ్మాస్త్రలో కనిపించనుంది. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం ఆలియా సర్వసన్నాహకాల్లో ఉంది.
ఒక్కో సినిమాకి పారితోషికం రేంజ్
ట్యాలెంటెడ్ ఆలియా భట్ ఒక్కో సినిమాకి 9-10 కోట్ల రేంజులో పారితోషికాలు అందుకుంటోందన్న సమాచారం ఉంది. ఇటీవల ఆర్.ఆర్.ఆర్ లో నటించినందుకు 5 కోట్ల మేర పారితోషికం అందుకుందని టాక్ వినిపించింది. కేవలం 10 రోజుల షూటింగ్ కి గాను ఈ బ్యూటీ ఏకంగా రూ.5 కోట్లు ఛార్జ్ చేసిందట.
అంటే రోజుకి 50 లక్షలు చొప్పున అలియాకి 'ఆర్.ఆర్.ఆర్' నిర్మాతలు చెల్లించారు. బాలీవుడ్ లో ఈ అమ్మడు ఒక్కో సినిమాకు 9 నుంచి 10 కోట్లు అందుకుంటుంది. రెండు నెలలు కాల్షీట్లు కేటాయిస్తుంది. కానీ 'ఆర్.ఆర్.ఆర్' విషయంలో అలియా మెట్టు దిగలేదు. 15 నిమిషాల స్క్రీన్ టైమ్ తో ఆలియా పాత్ర తెరపై కనిపించింది.