మెగాస్టార్.. ఈ ఒక్క పదం చాలు టాలీవుడ్ లో క్రేజ్ అనే మాటకు అర్ధం అంతరార్ధం చెప్పడానికి. ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే మెగాస్టార్ అక్కడ ఉన్నారంటే చాలు.. మొత్తం జనాలకు హుషారొచ్చేస్తుంది. సెలబ్రిటీలు కనిపిస్తే.. ఫ్యాన్స్ హంగామా చేయడం మామూలుగా జరిగేదే. కానీ ఓ ఫంక్షన్ నిండా సెలబ్రిటీలే ఉన్నపుడు కూడా.. అందరితోనూ అరుపులు కేకలు పెట్టించగల పవర్ మెగాస్టార్ కి మాత్రమే సొంతం.
మొన్న సినీ మా అవార్డ్స్ లో జరిగింది అదే. ఇప్పుడు సింగపూర్ లో జరుగుతున్న సైమా అవార్డ్స్ లోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. కంట్రీ మారినా చిరు ఎంట్రీ మారలేదు. అసలు అడుగు పెట్టడం నుంచే మెగా స్టైల్ మొదలైపోయింది. హుందాగా.. సింపుల్ గా అలా ఆయన నడిచొస్తుంటే చాలు.. ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. మొత్తం ఫంక్షన్ జరిగే ప్రాంగణమంతా చిరు వచ్చినప్పుడు ఈలలు - అరుపులు - చప్పట్లతో స్టేడియం మారుమోగించేశారు అభిమానులు. ఫ్యాన్స్ అనగానే ఎవరో అనుకోకండి.. అక్కడున్న అభిమానుల్లో ఎక్కువమంది సినిమా తారలే.
అలాగని టాలీవుడ్ జనాలు మాత్రమే కాదు. సౌతిండియా మొత్తం నుంచి వచ్చిన హీరోలు - హీరోయిన్లు - కేరక్టర్ ఆర్టిస్టులు - టెక్నీషియన్లే. అయినాసరే మెగాస్టార్ ని చూడగానే పూనకం వచ్చేసి.. మాస్ ఆడియన్స్ లెవెల్లో రచ్చ లేపేశారు. సైమా ఫంక్షన్ లో మెగా హంగామా చేసి పడేశారు. మెగాస్టార్ ఎంట్రీకి ఎలాంటి క్రేజ్ ఉంటుందో చాటి చెప్పారు మెగా ఫ్యాన్ సెలబ్రిటీస్.