తమిళ స్టార్ హీరో ధనుష్ ఒక వైపు హీరో గా నటిస్తూనే మరో వైపు నిర్మాత గా కొనసాగుతున్నాడు. ఈయన ఆ మద్య తన మామ రజినీకాంత్ తో ‘కాలా’ చిత్రాన్ని నిర్మించిన విషయం తెల్సిందే. రజినీకాంత్ గత చిత్రాలు పెద్ద గా ఆకట్టుకోలేక పోయినా కూడా ‘కాలా’ సినిమాను భారీ రేటుకు అమ్మాలనే పట్టుదల తో పలు ఏరియాల్లో భారీ రేటును చెప్పాడు. పలువురు డిస్ట్రిబ్యూటర్లు రేటు కాస్త తగ్గించమని రిక్వెస్ట్ చేసినా ఇష్టం అయితే తీసుకోండి లేదంటే లేదు అంటూ తెగేసి చెప్పాడట. ‘కాలా’ తెలుగు రైట్స్ ను కూడా భారీ మొత్తం కు అమ్మాడు. ‘కాలా’ చిత్రం ఫలితం తారు మారు అయ్యింది. తెలుగు రైట్స్ కొనుగోలు చేసిన వారు నష్టపోయారు.
ఇప్పుడు ఆయన నటించిన ‘మారి 2’ సినిమా కు కూడా భారీ గా రేటు డిమాండ్ చేస్తున్నాడు. ‘మారి 2’ తెలుగు శాటిలైట్ రైట్స్ ను 5 కోట్లకయితేనే ఇస్తానంటూ పట్టుబడుతున్నాడు. తెలుగు లో తప్పకుండా తన సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం తో ఆయన ఉన్నాడు. అయితే తెలుగు లో ధనుష్ కు పెద్దగా మార్కెట్ లేదు మరియు ఆ సినిమా ఫలితం పై నమ్మకం లేదు కనుక అంత మొత్తం పెట్టి కొనుగోలు చేసేందుకు ఏ ఒక్కరు ముందుకు రావడం లేదట.
తమిళం లో ఏమో కాని తెలుగు రైట్స్ కు ఇంత డిమాండ్ చేయడం ఏంటీ అంటూ ధనుష్ ను కొందరు ప్రశ్నిస్తున్నారు. ధనుష్ ఆశ కు హద్దు పద్దు లేకుండా పోయిందని, ఆయనకు పెద్ద గా క్రేజ్ లేని తెలుగు లో ఎలా అంత భారీ రేటును పెట్టి కొనుగోలు చేస్తారని అనుకుంటున్నారు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. ఈనెల 21న మారి 2 చిత్రం తమిళం మరియు తెలుగు లో విడుదలకు సిద్దం అయ్యింది.