స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సరైనోడు మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ప్రస్తుతం పాటల చిత్రీకరణలో ఉంది యూనిట్. రీసెంట్ గా బన్నీ - కేథరిన్ లపై వచ్చే ఓ పాట కోసం హైద్రాబాద్ లో భారీ సెట్ వేశారు. కేవలం ఈ సెట్టింగులకే కోటిన్నరకు పైగా వెచ్చించారన్న వార్తలు సంచలనం అవుతున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ లోని ఏడు ఎకరాల్లో భారీ సెట్ నిర్మాణం జరిపింది యూనిట్.
ఫాస్ట్ బీట్ తో సాగే ఈ పాటలో.. బన్నీ - కేథరిన్ లు డ్యాన్సులు కుమ్మేస్తున్నారని అంటున్నారు. 300మంది డ్యాన్సర్లతో ఈ సాంగ్ ని పిక్చరైజ్ చేస్తున్నారట. మరో 2-3 రోజుల్లో ఈ సాంగ్ పిక్చరైజేషన్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. బాలీవుడ్ కొరిగ్రాఫర్ ద్వయం బాస్కో సీజర్ లు ఈ పాటకు డ్యాన్స్ కంపోజ్ చేశారు. కేవలం ఈ పాట చిత్రీకరణ కోసం లాంబోర్గిని కార్ ని కూడా తెచ్చారట. సినిమాలో ఈ పాట స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుందని టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఈ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ స్వయంగా నిర్మిస్తుండడంతో.. ఖర్చు విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు.
గతంలో ఇంటర్వెల్ బ్యాంగ్ కోసం దాదాపు మూడు కోట్లు ఖర్చు చేసి, భారీ ఫైట్ ని నిర్మించారనే వార్తలొచ్చాయి. ఇప్పుడు పాట కోసం కోటిన్నర నుంచి రెండు కోట్లు పెట్టారంటే.. బన్నీ కెరీర్ లోనే అత్యంత కాస్ట్లీ చిత్రంగా సరైనోడు నిలిచే అవకాశం ఉంది. మిగిలిన పనులు కూడా త్వరగా పూర్తి చేసేసి, మార్చ్ నెలలో ఆడియోని, ఏప్రిల్ 28న మూవీని విడుదల చేసేందుకు డైరెక్టర్ బోయపాటి శ్రీను నిర్ణయించుకున్నాడు.