సామాజిక మాధ్యమాల వెల్లువలో ప్రతిదీ ఆన్ లైన్ లో ఓ డిబేట్ గా మారింది. అయిన దానికి కానిదానికి నెటిజనం స్పందిస్తూ ఏదో ఒక కామెంట్ పోస్ట్ చేస్తూ నిరంతరం వెబ్ ని వేడెక్కిస్తూనే ఉన్నారు. అగ్గిపుల్ల గుగ్గిపుల్ల.. సబ్బు బిళ్ల కాదేదీ సామాజిక మాధ్యమాలకనర్హం అన్న చందంగా వెలిగిపోతోంది ఈ ట్రెండ్. ముఖ్యంగా సినిమాలపై రివ్యూలు.. సరదా కామెంట్లు.. మరీ ఎక్కువైపోయాయి. హాలీవుడ్ .. బాలీవుడ్ టు టాలీవుడ్ ఈ ట్రెండ్ వైరల్ గానే రన్ అవుతోంది.
తాజాగా ఇదే తరహా సెగ కబీర్ సింగ్ ని తాకింది. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ నటిస్తున్న తాజా చిత్రం కబీర్ సింగ్ ట్రైలర్ రిలీజైన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ తెలుగు వెర్షన్ అర్జున్ రెడ్డి స్టైల్లోనే ఉత్తరాది ఆడియెన్ కి కనెక్టయ్యింది. ఇక డ్రగ్ అడిక్ట్ అయిన ఒక మెడికో ప్రేమలో విఫలమైతే మరీ ఇంత దారుణంగా మారతాడా? అంటూ ఈ ట్రైలర్ కి నెటిజనం నుంచి మితిమీరిన కామెంట్లు.. జోకులు వినాల్సి వస్తోంది. కబీర్ సింగ్ పై మీమ్స్ ముంచెత్తుతున్నాయి. తెలివిమీరిన నెటిజనం తెలివైన కుళ్లు జోకులతో కుళ్లబొడిచేస్తున్నారు. ఎంతగా అంటే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్ని ఈ ట్రైలర్ కి లింక్ పెడుతూ మీమ్స్ ని జోడించడం చూస్తుంటే సినిమా వాళ్ల క్రియేటివిటీని మించి జనాల క్రియేటివిటీ ఉందని అర్థమవుతోంది. ప్రస్తుతం మన విద్యా అవ్యవస్థను.. మనుషుల సైకాలజీకి ముడిపెడుతూ మీమ్స్ .. జోకులతో నెటిజనం విరుచుకుపడడం చూస్తుంటే అర్థం చేసుకోవచ్చు.
అర్జున్ రెడ్డి అలియాస్ కబీర్ సింగ్ లాంటి డాక్టర్లు సంఘంలో ఉంటారా.. ఉంటే వీళ్లు సిస్టమ్ ని మార్చేయడం ఖాయం అంటూ షాహిద్ ని ఉద్ధేశిస్తూ కామెంట్లు నెటిజనంలో స్క్రోల్ అవుతున్నాయి. ఈ సినిమాలో కబీర్ సింగ్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేందుకు డజన్ల కొద్దీ సిగరెట్లు తాగాల్సొచ్చిందని షాహిద్ ఓ ప్రమోషన్ కార్యక్రమంలో అన్నారు. తాగి తూగి చెడిపోయే కబీర్ సింగ్ లాంటి జనాలకు ఈ సినిమా ఓ థెరపీలా మెడిసిన్ లా పని చేస్తుందని షాహిద్ ప్రచారం చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. దానిపైనా బోలెడన్ని జోకులు వేస్తున్నారు. అయితే సినిమా అన్నది మెడిసిన్ లాంటిది. నన్ను నేను తరచి చూసుకునేందుకు .. నా జీవితం అలా అయిపోతే ఏమయ్యేదో అని అర్థం చేసుకునేందుకు సాయపడిందని షాహిద్ ప్రమోషన్స్ లో వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి మన తెలుగు సినిమా కథాంశం ఈ రేంజులో ఉత్తరాదిన వైరల్ అవ్వడం.. అలాగే ఈ సినిమాకి మన తెలుగు కుర్రాడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తుండడం ఇంత వైరల్ గా దీనిపై చర్చ సాగడం ఓ రకంగా ఉత్కంఠ పెంచుతోంది.