వరుణ్ తేజ్ లాంటి హీరోను పెట్టుకుని పరిమితమైన బడ్జెట్లోనే అంతర్జాతీయ ప్రమాణాలతో కంచె సినిమా తీశాడు క్రిష్. ఎన్నో లిమిటేషన్స్ మధ్య ఆ సినిమాలో వార్ సీన్స్ ను ఎంతో గొప్పగా తీర్చిదిద్ది అందరి ప్రశంసలు అందుకున్నాడు క్రిష్. ఇప్పుడతడికి బాలయ్య లాంటి మాస్ హీరో దొరికాడు. బడ్జెట్ పెంచుకునే వీలు దొరికింది. ఇక ఏమాత్రం తగ్గొద్దని నిర్ణయించుకున్నట్లున్నాడు. ఈ సినిమాలో ఒక్క వార్ సీన్ కోసమే ఏకంగా రూ.8 కోట్లు ఖర్చు పెడుతుండటం విశేషం. బాహుబలి తర్వాత తెలుగులో అత్యంత భారీగా ఉండబోతున్న వార్ సీన్ ఇదే అవుతుందని భావిస్తున్నారు.
ఈ నెల 7న మొరాకోలో చిత్రీకరించబోయే వార్ సీక్వెన్స్ తో గౌతమీపుత్ర శాతకర్ణి రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సన్నివేశాల కోసం 4 టన్నుల ఆయుధాలు.. ఇతర సామగ్రిని హైదరాబాద్ నుంచి అక్కడికి తరలించినట్లు సమాచారం. అంతే కాక 800 మంది దాకా జూనియర్ ఆర్టిస్టులు కూడా అక్కడికి చేరుకున్నారట. ప్రొడ్యూసర్ రాజీవ్ రెడ్డి మొరాకోలోనే ఉంటూ షూటింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నాడు. ఒకట్రెండు రోజుల్లో బాలయ్యతో పాటు క్రిష్ కూడా మొరాకోకు బయల్దేరే అవకాశముంది. ఈ సన్నివేశాలకు సంబంధించి కంప్యూటర్ గ్రాఫిక్స్ కోసం నాలుగు బృందాలు పని చేస్తున్నట్లు సమాచారం. ఈ వార్ సీక్వెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణ అవుతుందని భావిస్తున్నారు.