దక్షిణాది ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ చాలా గ్యాప్ తర్వాత దర్శకత్వం వహించిన హిందీ సినిమా ''హంగామా 2''. ఇది 2003లో వచ్చిన 'హంగామా' చిత్రానికి సీక్వెల్. జావేద్ జాఫ్రీ కుమారుడు మీజాన్ జాఫ్రీ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రణీత సుభాష్ హీరోయిన్ గా నటిస్తోంది. సౌత్ లో మెప్పించిన ప్రణీత కు ఇది బాలీవుడ్ డెబ్యూ మూవీ. ఇందులో శిల్పా శెట్టి - పరేష్ రావల్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. 1994లో ప్రియదర్శన్ తెరకెక్కించిన మలయాళ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'మిన్నారం' రీమేక్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు. థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసిన ఈ చిత్రం డిస్నీ+హాట్ స్టార్ లో జూలై 23న డైరెక్ట్ ఓటీటీ విధానంలో విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా 'హంగామా 2' ట్రైలర్ ను బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ రిలీజ్ చేసి చిత్ర బృందానికి విషెస్ అందజేశాడు.
ట్రైలర్ లోకి వెళ్తే.. ప్రణీత సుబాష్ బిడ్డకు తండ్రి ఎవరు అనే డిస్కషన్ తో ప్రారంభమవుతుంది. మీజాన్ జాఫ్రీ తన బిడ్డ కాదని అశుతోష్ రానాకు వివరిస్తూ కనిపిస్తాడు. ఇందులో శిల్పా శెట్టి భర్తగా పరేష్ రావల్ నటించాడు. అందమైన తన భార్యకు అందరూ లైన్ వేస్తున్నారని అనుమాన పడే పరేష్... మీజాన్ - శిల్పా క్లోజ్ గా ఉండటం చూసి వారి మధ్య ఎఫైర్ ఉందని అపార్ధం చేసుకుంటునట్లు చూపించారు. ఈ నేపథ్యంలో అనుమానం - అపార్థాల వల్ల పాత్రల మధ్య ఏర్పడిన గందరగోళం నవ్వు తెప్పిస్తోంది. శిల్పాశెట్టి కంబ్యాక్ మూవీ కావడంతో ఇందులో ఆమె పాపులర్ సాంగ్ 'చురాకే దిల్ మేరా' ను రీమేక్ చేసినట్లు తెలుస్తోంది. డబుల్ హంగామా అంటూ వస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ''హంగామా 2'' ఎలాంటి ప్రేక్షకాదరణ దక్కించుకుంటుందో చూడాలి.
Full View