రక్తచరిత్ర, ధోని, లెజెండ్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన బాలీవుడ్ భామ రాధికా ఆప్టే. కొన్ని రోజులుగా ఈమె పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. రాధికవంటూ వచ్చిన న్యూడ్ సెల్ఫీలు ఆమె పేరును మారుమోగేలా చేశాయి. ఆ తర్వాత హాలీవుడ్ సినిమాలో రాధిక నగ్నంగా కనిపించబోతోందన్న వార్త పెద్ద సంచలనమైంది. ఇప్పుడు రాధిక నటించిన 'హంటర్' సినిమా టాక్ ఆఫ్ ద బాలీవుడ్ అవుతోంది. ఈ సినిమా టైటిల్ డిజైన్ చూస్తేనే జనాల మతులు పోతున్నాయి. హంటర్ అనే పదంలో 'ఆర్' అక్షరాన్ని డిజైన్ చేసిన తీరు చూసి జనాలకు నోట మాట రావట్లేదు.ఇక పోస్టర్ లుక్‌లోనూ బూతు కంటెంట్ తక్కువేమీ లేదు. ఈ బనానా పోస్టర్‌ను బట్టే సినిమాలో అడల్ట్ కంటెంట్ ఏ రేంజిలో ఉండబోతోందో తెలిసిపోతోంది. పైగా 'స్కోరింగ్ బిగిన్స్' అంటూ కింద క్యాప్షన్ ఒకటి. ఈ మధ్య విడుదలైన ట్రైలర్ నిండా కూడా బూతులే. సెక్స్ కోసం హీరో పడే ఆరాటం గురించే సినిమా అంతా నడుస్తుందని అర్థమైపోతోంది. హాలీవుడ్లో ఇలాంటి అడల్ట్ కంటెంట్ మూవీలు సహజమే. ఐతే బాలీవుడ్‌లోనూ ఈ మధ్య ఇలాంటి ప్రయత్నాలు మొదలయ్యాయి. హంటర్ వాటన్నింటికీ రారాజులా అనిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్ విషయంలో పెద్ద గొడవ జరిగి.. దాన్ని నిషేధించే వరకు వెళ్లింది. సినిమా విడుదలయ్యాక ఇంకెన్ని గొడవలుంటాయో.