'సెవెన్' పై కోర్టు గొడ‌వ‌లేంటి?

Update: 2019-06-05 03:39 GMT
హ‌వీష్ హీరోగా న‌టించిన `7-సెవెన్` ఈ శుక్ర‌వారం రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. నిజార్ షఫీ దర్శకత్వంలో రమేష్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ శుక్ర‌వారం రిలీజ్ సంద‌ర్భంగా.. నేటి (గురువారం) సాయంత్రం పెయిడ్ ప్రీమియ‌ర్ల‌కు ప్లాన్ చేస్తున్నామ‌ని చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించింది. అభిషేక్ నామా ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు. అయితే రిలీజ్ ముంగిట ఊహించ‌ని ట్విస్ట్ చిత్ర‌యూనిట్ స‌హా పంపిణీవ‌ర్గాల‌కు షాకిచ్చింది.

సెవెన్ రిలీజ్ పై హైద్రాబాద్ సివిల్ కోర్టు స్టే విధించింది. ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం ఇస్తానని రమేష్ వర్మ తన దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని మోసం చేశార‌ని ఎన్నారై కిరణ్ కె.తలశిల మీడియాకి వివ‌రాల్ని వెల్ల‌డించారు. ఒక కామ‌న్ వ్య‌క్తి ద్వారా ర‌మేష్ వ‌ర్మ‌ను క‌లిసి ఈ సినిమాకి భాగస్వామిగా మారాన‌ని రూ.25ల‌క్ష‌లు పెట్టుబ‌డి పెట్టాన‌ని తెలిపారు. `నిహారిక త‌ల‌సిల‌` అనే పేరును స‌మ‌ర్ప‌కురాలిగా వేస్తాన‌ని మాటిచ్చార‌ని.. అయితే రిలీజ్ ముంగిట మోసం చేశార‌ని ఆరోపించారు. ప్ర‌స్తుతానికి సెవెన్ రిలీజ్ కాకుండా కోర్టులో టెంప‌ర‌రీ ఇంజెక్ష‌న్ తేవ‌డం సంచ‌ల‌న‌మైంది.

డ‌బ్బు వెన‌క్కి ఇవ్వ‌లేదు.. పేరు వేయ‌లేదు! అందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని కిర‌ణ్.కె.త‌ల‌సిల తెలిపారు. ఇక డ‌బ్బు విష‌య‌మై ప‌లుమార్లు ర‌మేష్ వ‌ర్మ‌ను అడిగినా ఎలాంటి రెస్పాన్స్ లేద‌ని దాంతో తెలుగు ఫిలించాంబ‌ర్ లో సంప్ర‌దించాన‌ని ఓ ప్రెస్ నోట్ ని పంపించారు కిర‌ణ్ కె.త‌ల‌సిల‌. ఫిలింఛాంబ‌ర్ లో న్యాయం జ‌ర‌గ‌క పోవ‌డం వ‌ల్ల‌నే న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని.. అందుకు బాధ‌గా ఉంద‌ని కిరణ్ వెల్ల‌డించారు. అయితే సెవెన్ రిలీజ్ విష‌యంలో నిన్న‌టి నుంచి ఏవో గుస‌గుస‌లు వినిపించాయి. ఓ వైపు ప్ర‌మోష‌న్ సాగుతున్నా.. దీనిపై పంపిణీదారు అభిషేక్ స‌హా ఇత‌రుల్లో డిస్క‌ష‌న్ సాగింది. ఎట్ట‌కేల‌కు అధికారికంగా పూర్తి క్లారిటీ వ‌చ్చింది.


Tags:    

Similar News