జబర్దస్త్ ఆది.. అంటే ఎక్కువగా గుర్తు పట్టరు. కానీ హైపర్ ఆది అంటే రెండు తెలుగు రాష్టాలు ఇట్టే గుర్తు పట్టేస్తాయి. మూడు నెలలు టీవీలలో జబర్దస్త్ ప్రోగ్రాం లేక ఎంతోమంది వెలతిగా ఫీలయ్యుంటారు. వారికోసం లాక్ డౌన్ సడలింపులతో జబర్దస్త్ ఇటీవలే ప్రారంభం అయింది. తాజాగా ప్రోమోలు విడుదల అవడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో హైపర్ ఆది ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ తెగ వైరల్ అవుతోంది. అసలు ఆయన ఎలా జబర్దస్త్ లోకి వచ్చాడు.. ఎలా ప్రయాణం సాగింది అనే విషయాలు అన్నీ షేర్ చేసుకున్నాడు. హైపర్ ఆది మాట్లాడుతూ.. "నాకు చిన్నప్పటి నుంచి స్క్రీన్ మీద కనిపించాలనే కోరిక లేదు. బిటెక్ పూర్తయ్యాక జాబ్ చేసేటప్పుడు ఈ ఆలోచన వచ్చింది. నేను ఆలోచించే టైంలో జబర్దస్త్ బాగా పాపులర్ షో. జాబ్ చేసేప్పుడు ల్యాప్ టాప్‌లో ఆసక్తిగా చూసేవాళ్లం. కానీ హైదరాబాద్ వచ్చాక ఈ జబర్దస్త్ వాళ్లు ఎక్కడుంటారో తెలుసుకోవాలని.. చూడాలనే ఆశ బాగా ఉండేది. తర్వాత నేను చేసిన ఒక చిన్న షార్ట్ ఫిలిమ్‌కి అదిరే అభి ‘బాగుంది బ్రదర్.. ఒకసారి కలువు’ అని ఒక మెసేజ్ పెట్టాడు. ఆయన ఎందుకు పిలిచాడో పక్కన పెడితే.. ఫస్ట్ వాళ్ళందరిని చూస్తానన్న ఆత్రం నాలో ఎక్కువగా ఉండేది.
అన్న మెసేజ్ పెట్టగానే వెళ్లి.. ముందుగా అక్కడున్న టీమ్ లీడర్ దగ్గర నుంచి కంటెస్టెంట్స్ వరకూ అందరితో ఫోటోస్ దిగేశాను. ఫోటోలు దిగాక ఊరుకుంటానా.. వాళ్లందరితో దిగిన ఫోటోలన్ని ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశాను. అప్పటివరకు ఒక లైక్, రెండు లైక్స్ వచ్చే నాకు.. జబర్దస్త్ టీమ్ లతో ఫోటో పెట్టేసరికి వందలలో లైక్స్ వచ్చేవి. అలా లైక్స్ రావడంతో నాకు మరో ఆలోచన వచ్చింది. ఫోటో పెడితేనే ఇన్ని లైక్స్ వస్తే.. మనం కూడా ఒకసారి టీవీలో కనిపిస్తే.. ఇంకెలా ఉంటుందో అని. అప్పటినుండి అభి అన్న నంబర్ ఉంది కదా.. అని అన్నకి రోజు మెసేజ్ పెట్టేవాడ్ని. అన్నా మీ స్కిట్‌లో ఏదైనా చూడండి అన్నా.. మీ స్కిట్ సూపర్ అన్నా.. మీ స్కిట్‌లో నాకు ఏదైనా ఛాన్స్ ఇవ్వండి అన్నా.. ఇలా మెసేజ్‌లు చేస్తూనే ఉన్నా. అలా అభి అన్న గుర్తుపెట్టుకుని నన్ను ఓసారి పిలిపించారు. అప్పుడే సునీల్ గారు జబర్దస్త్ షోకి గెస్ట్‌గా వచ్చారు. టీవీలో కనిపించాలనే ఆత్రంతో ఉన్న నాకు.. సునీల్ గారు ఎక్కిన రిక్షాని లాక్కొచ్చి వెళ్లిపోయే క్యారెక్టర్ ఇచ్చారు. ఆ ఒక్కటి చేసే నేను మళ్లీ ఫేస్ బుక్‌లో పెట్టేశాను. సునీల్ గారితో యాక్ట్ చేశానని, మాములుగా ఉండదు.. సూపర్.. బంపర్ పోస్ట్ చేశా.
అంతే తెలిసిన వాళ్లంతా టీవీల ముందు కూర్చున్నారు. అయితే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది ఆ క్యారెక్టర్. పాస్‌లో పెట్టి చూస్తేనే కానీ అక్కడ నేనున్నానని ఎవరికి తెలియదు. సెకండ్స్ లో వెళ్లిపోయే క్యారెక్టర్ చేసి రచ్చ చేశా. పెట్టిన పోస్టుకి లైక్స్ బాగానే వచ్చాయి.. అది టెలికాస్ట్ అయ్యాక కామెంట్స్ అంతకంటే ఎక్కువగా వచ్చాయి. ‘ఏం చేశావురా నువ్వు? ఎందుకు పెట్టావ్ రా ఫోటో? సునీల్ గారితో చేశానంటే నువ్వేదో ఆయన మీద కౌంటర్ వేసి.. డైలాగ్స్ కొడతావ్ అనుకుంటే రిక్షా లాక్కొచ్చావ్.. అది కూడా ఆపి చుస్తే కానీ కనిపించట్లేదని’ ఇలా కామెంట్స్ వచ్చాయి. అప్పుడు నాకు ఎక్కువసేపు కనబడడానికి ఏదొకటి చెయ్యాలి అనిపించింది. తర్వాత చిన్నగా అభి అన్న స్కిట్‌లో చేస్తూ ఉండగా.. నేనే స్కిట్లు రాయాల్సి వచ్చింది. అవి కాస్త డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ వాళ్లకి నచ్చేసి నా మీద ఫోకస్ పెట్టడం.. నన్ను టీమ్ లీడర్‌ని చెయ్యడం.. ఇలా అంతా జరిగిపోయింది. తర్వాత కానీ నా అచీవ్‌మెంట్ ఏంటంటే.. ఎప్పుడైతే నేను సునీల్ గారిని రిక్షాలో లాక్కొచ్చానో.. అదే సునీల్ గారు నేను టీమ్ లీడర్‌గా చేసిన స్కిట్‌లో నాతో పాటు స్కిట్ చేసి.. నేను ఆయన మీద పంచ్‌లు వేయడం.. అది నిజంగా ప్రౌడ్ ఫీలింగ్’ అంటూ తన మనసులోని మాటలన్నీ బయట పెట్టాడు హైపర్ ఆది.