సినిమాలో నేను అలా ఉన్నాను.. కార‌ణం ఇదేః లావ‌ణ్య త్రిపాఠి

Update: 2021-03-17 00:30 GMT
ఆర్ ఎక్స్‌100 ఫేమ్‌ కార్తికేయ - లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా రాబోతున్న చిత్రం 'చావు క‌బురు చ‌ల్ల‌గా'. ప్ర‌ముఖ నిర్మాతలు అల్లు అర‌వింద్, బ‌న్నీవాసు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి తెర‌కెక్కించారు. ఈ సినిమా ఈ నెల 19న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.

ఇప్ప‌టికే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా నిర్వ‌హించ‌డంతో ఈ చిత్రానికి మంచి హైప్ వ‌చ్చింది. తాజాగా.. ఈ సినిమాలోని ఓ పాట‌కు సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది యూనిట్‌. ''ఎట్టాగా పుట్టావురో.. అట్టాగే పోతావురో.. ఉన్న‌న్నాళ్లూ పండ‌గ‌చేసి పాడెక్కెయ్ రో..'' అంటూ సాగిపోయే ఫాస్ట్ బీట్ కేక పెట్టిస్తోంది.

కాగా.. ఈ చిత్రంలో త‌న పాత‌కు సంబంధించిన ఓ సీక్రెట్ రివీల్ చేసింది లావ‌ణ్య‌. ఈ సినిమాలో తాను కొంచెం న‌ల్ల‌గా క‌నిపించ‌బోతున్నాన‌ని చెప్పిన బ్యూటీ.. దానికి గ‌ల కార‌ణం ఏంటో కూడా వెల్ల‌డించింది. ఈ సినిమా విశాఖ‌ప‌ట్నం నేప‌థ్యంలో సాగుతుంద‌ని, అందువ‌ల్ల త‌న పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా న‌లుపు రంగు మేకప్ వేసుకోవాల్సి వ‌చ్చింద‌ని తెలిపింది.

అంతేకాకుండా.. హీరో గురించి కూడా చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో కార్తికేయ గెట‌ప్ చాలా బాగుంటుంద‌ని వెల్ల‌డించింది. ఇక‌, డైలాగ్ డెలివ‌రీ, మాడ్యులేష‌న్ పీక్స్ అని చెప్పింది. మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌నిపించేలా వినాల‌నిపించేలా ఉంటాయ‌ని చెప్పిందీ బ్యూటీ. మ‌రి, ఇందులో వాస్త‌వం ఎంతో తెలియాలంటే.. మ‌రో మూడు రోజులు వెయిట్ చేయాల్సిందే.
Tags:    

Similar News