సల్లూని కాదంటున్న సెక్స్ బాంబ్

Update: 2017-04-03 13:33 GMT
చేతిలో పెద్దగా సినిమాలు లేకపోయినా.. నిత్యం న్యూస్ లో నాని క్రేజ్ కాపాడుకోవడం ఎలా అనే విషయంలో.. సెక్స్ బాంబ్ రాఖీ సావంత్ కి ఇప్పటికే 10కి పైగా పట్టాలు ఇచ్చేయచ్చు. ఆ రేంజ్ లో వివాదాలను రగిల్చేయడం.. ఒకళ్లిద్దరిని కాదు.. ఏకంగా ఓ కమ్యూనిటీనే కదిల్చేయగలగడం రాఖీకి మాత్రమే చేతనైన విద్య.

తాజాగా వాల్మీకి పేరుతో ఓ వివాదం వెలిగించింది రాఖీ. 'దొంగ నుంచి పండితుడిగా వాల్మీకి ఎలా ఎదిగాడో.. నా స్నేహితుడు మికా సింగ్ కూడా దాడి కేసు నుంచి మంచోడిగా మారాడు' అంటూ రామాయణానికి లింక్ చేసి.. ఓ ఉదాహరణ చెప్పింది ఈ భామ. ఇక వాల్మీకి వంశస్తులు ఊరుకుంటారా.. రామాయణాన్ని కోర్టు కేసులు ఎదుర్కుంటున్న వ్యక్తితో  పోల్చితే సైలెంట్ గా ఉంటారా.. రగలాల్సిన మంట రగిలింది. కేసులు.. కోర్టుల వరకూ విషయం వెళ్లగా.. తాజాగా ఈమెపై అరెస్ట్ వారంట్ కూడా జారీ అయిపోయింది. అయితే అరెస్ట్ గురించి.. వారెంట్ గురించి తనకేం తెలియదన్న రాఖీ సావంత్.. ఈ సారి సల్మాన్ ఖాన్ ని సీన్ లోకి తెచ్చేసింది.

'నేనేమీ సల్మాన్ ఖాన్ ని కాదు.. రాఖీ సావంత్ ని. నన్ను అరెస్ట్ చేస్తే మీకేమీ దక్కదు. సినిమాలతో పాటు సామాజిక సేవ చేసుకునే సాధారణ యువతిని నేను' అంటూ డైవర్ట్ చేసేందుకు ట్రై చేసింది. చివరకు 'వాల్మీకి భగవంతుడికి.. నా వ్యాఖ్యలతో బాధపడ్డ అందరికీ క్షమాపణలు' అంటూ చల్లార్చే ప్రయత్నం చేస్తోంది కానీ.. కోర్టు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News