ఐ డోంట్ కేర్ -త్రిష

Update: 2018-01-09 17:16 GMT
సౌత్ లో మోస్ట్ సీనియర్ హీరోయిన్ త్రిష ఎప్పుడు లేని విధంగా ఓ విమర్శను ఎదుర్కోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అమ్మడు తన మంచి తనంతో దాదాపు 15 ఏళ్ల నుండి ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. ముఖ్యంగా సినిమాకు సంబంధించిన విషయంలో అమ్మడు ఎలాంటి జోక్యం చేసుకునేది కాదు. ఒక్కసారి కథకు ఒకే చెప్పిందంటే సినిమా ఎండ్ అయ్యే వరకు త్రిష చాలా కష్టపడుతుంది అనే టాక్ ఉంది.

కానీ రీసెంట్ గా ఒక సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యాకా   సడన్ గా తప్పుకొని అందరికి షాక్ ఇచ్చింది. స్టార్ హీరో విక్రమ్ నటించిన స్వామి సినిమా తమిళ్ లో చాలా పెద్ద హిట్ అయ్యింది. అయితే ఆ సినిమాకు ప్రస్తుతం సీక్వెల్ రూపొందుతోంది. సినిమాకి అంతా సిద్ధం చేసుకొని త్రిష తో పాటు మరో హీరోయిన్ గా కీర్తి సురేష్ ని కూడా ఎంపిక చేశారు. కానీ ఏమైందో ఏమోగానీ త్రిష సడన్ గా సినిమాలో నుండి తప్పుకుంది. దీంతో నిర్మాత నిర్మాత మండలికి పిర్యాదు చేశాడు. సినిమాలో అయినా జాయిన్ అవ్వాలి లేకుంటే నష్టపరిహారం అయినా ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.

కానీ త్రిష మాత్రం అలాంటి వార్నింగ్ కి అస్సలు బెదిరేలా లేదు. రీసెంట్ గా ఒక ట్వీట్ తో కౌంటర్ వేసింది. బ్రేకింగ్ న్యూస్: ఐ డోంట్ కేర్ అంటూ చిన్న ట్వీట్ చేయడంతో అమ్మడి డేర్ కి అందరు షాక్ అవుతున్నారు. అయితే అమ్మడు వెళ్లిపోవడానికి కారణం ఇదే అని కొన్ని రూమర్స్ చాలా వినిపిస్తున్నాయి. క్రియేటివ్ డిఫరెన్స్ రావడం వల్లనే తప్పుకుంది అని చాలా వరకు కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని త్రిష మాత్రం నిర్మాతల సంఘగానికి కూడా భయపడేది లేదని చిన్న కామెంట్ తో చెప్పకనే చెప్పేసింది.
Tags:    

Similar News