ఐశ్వర్యను కొట్టలేదు.. డైరెక్టర్ని కొట్టా-సల్మాన్

Update: 2017-03-14 07:06 GMT
సల్మాన్ ఖాన్-ఐశ్వర్యారాయ్ ఒకప్పుడు ప్రేమ బంధంలో ఉన్న బహిరంగ రహస్యం. ‘హమ్ దిల్ కే చుకే సనమ్’ సినిమా సందర్భంగా దగ్గరైన ఈ జంట.. ఓ దశలో పెళ్లికి కూడా రెడీ అయినట్లు వార్తలొచ్చాయి. కానీ ఆ తర్వాత సల్మాన్ శాడిజం భరించలేక ఐశ్వర్య అతడికి దూరమైనట్లు ప్రచారం జరిగింది. సల్మాన్ ఐశ్వర్యను తీవ్రంగా వేధించాడని.. ఆమెను శారీరకంగానూ హింసించాడని కూడా ఆరోపణలు వచ్చాయి. ఐతే దీనిపై ఐశ్వర్య కానీ.. సల్మాన్ కానీ ఎప్పుడూ నోరు విప్పింది లేదు. ఐతే తాజాగా సల్మాన్ ఈ ఆరోపణలపై స్పందించాడు. తాను ఎప్పుడూ ఐశ్వర్యపై చేయి చేసుకోలేదని స్పష్టం చేశాడు. ఐతే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుభాష్ ఘాయ్ ను మాత్రం తాను కొట్టినట్లు సల్మాన్ చెప్పడం విశేషం.

‘‘ఐశ్వర్యను నేనెప్పుడూ కొట్టలేదు. నిజాని నన్నే చాలా మంది కొట్టేవాళ్లు. కోపం.. బాధ వస్తే నన్ను నేను గాయపరుచుకునేవాడిని. తలను గోడకేసి కొట్టుకునేవాడిని. నేనంటే ఎవ్వరికీ భయం ఉండేది కాదు. కానీ నేనే ఒకసారి సుభాష్ ఘాయ్‌ ని కొట్టాను. ఐతే అందులో నా తప్పేం లేదు. ఆయనే నా పట్ల దారుణంగా వ్యవహరించాడు. నేను హర్టయ్యాను. ఆయన నా షూలపై మూత్రం పోశాడు. అంతే కాదు నన్ను స్పూన్ తో కొట్టాడు. చేతిలో ఉన్న ప్లేటుని ముఖం పైకి విసిరాడు. మెడపట్టి నెట్టాడు కూడా. దీంతో సహనం కోల్పోయాను. ఆ పరిస్థితుల్లో ఆయన్ని కొట్టాల్సి వచ్చింది. ఐతే తర్వాత సారీ చెప్పాను’’ అని సల్మాన్ తెలిపాడు. ఈ ఘటనపై అప్పట్లో సుభాష్ ఘాయ్ కూడా స్పందించాడు. సల్మాన్ తన పట్ల దారుణంగా ప్రవర్తించాడని.. దీనిపై సల్మాన్ తండ్రి తనకు సారీ చెప్పి.. తర్వాత తన కొడుకును కూడా తన వద్దకు పంపి సారీ చెప్పించాడని అన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News