గాయం గురించి చరణ్‌ ఏమన్నాడంటే

Update: 2019-04-04 05:28 GMT
రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రం షూటింగ్‌ ఉత్తర భారతదేశంలో జరుగుతున్న విషయం తెల్సిందే. సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతున్న సమయంలో రామ్‌ చరణ్‌ జిమ్‌ లో వర్కౌట్స్‌ చేస్తున్న సమయంలో గాయం అయిన విషయం తెల్సిందే. రామ్‌ చరణ్‌ కు అయిన గాయం కారణంగా ఆయన షూటింగ్‌ లో పాల్గొనలేక పోతున్నాడని, షూటింగ్‌ కు కొన్ని రోజులు బ్రేక్‌ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఆ విషయమై రకరకాల పుకార్లు రాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో స్వయంగా రామ్‌ చరణ్‌ స్పందించాడు.

చరణ్‌ ఫేస్‌ బుక్‌ లో స్పందిస్తూ... 'ఆర్‌ ఆర్‌ ఆర్‌' షెడ్యూల్‌ చాలా బాగా జరుగుతుంది. ఇలాంటి సమయంలో దురదృష్టవశాత్తు జిమ్‌ లో వర్కౌట్స్‌ చేస్తుంటే నా మోకాలికి గాయం అయ్యింది. ప్రస్తుతం నాకు బాగానే ఉంది, అయితే కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైధ్యులు సూచించారు. దాంతో మూడు వారాల పాటు షూటింగ్‌ కు బ్రేక్‌ తీసుకుని, ఆ తర్వాత షూటింగ్‌ లో పాల్గొంటాను అంటూ పోస్ట్‌ చేశాడు.

రామ్‌ చరణ్‌ రామ రాజు పాత్రలో నటిస్తున్న ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమాలో ఎన్టీఆర్‌ కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు. చరణ్‌ లేకుండా ఎన్టీఆర్‌ మరియు ఇతర చిత్ర యూనిట్‌ సభ్యులపై రాజమౌళి షూట్‌ చేస్తాడా లేదంటే రామ్‌ చరణ్‌ క్యూర్‌ అయ్యే వరకు జక్కన్న షూటింగ్‌ కు బ్రేక్‌ ఇస్తాడా అనేది చూడాలి. రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌ లు చిత్రంలో చాలా ప్రత్యేకంగా కనిపించనున్న నేపథ్యంలో మెగా మరియు నందమూరి ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తప్పకుండా ఈ చిత్రం మరో బాహుబలిలా ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.

Tags:    

Similar News