హ్యాపీ డేస్ సినిమా తో నటుడిగా పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే మంచి పేరును దక్కించుకున్న నిఖిల్ ఈమద్య కాలంలో వరుసగా సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్న నిఖిల్ మొదటి సారి తన భార్యతో కలిసి మీడియా ముందుకు వచ్చాడు. ప్రేమ వివాహం ను పెద్దలను ఒప్పించి చేసుకున్న నిఖిల్ తమ ప్రేమ వ్యవహారాలను మొదటి సారి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.
నిఖిల్ చాలా ఏళ్లుగా డాక్టర్ పల్లవి ని ప్రేమించాడు. వీరి ప్రేమ విషయం పెద్దగా బయటకు రాలేదు. డాక్టర్ పల్లవిని నిఖిల్ ప్రేమిస్తున్నాడు అనే విషయం పెళ్లికి కొన్నాళ్ల ముందు అది కూడా ఆయన రివీల్ చేస్తేనే క్లారిటీ వచ్చింది. 2020 సంవత్సరంలో యంగ్ హీరోలు వరుసగా పెళ్లికి సిద్దం అవుతున్న సమయంలో లాక్ డౌన్ లోనే డాక్టర్ పల్లవిని పెళ్లి చేసుకున్నాడు ఈ హీరో. వీరి పెళ్లి వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో అప్పుడు వైరల్ అయ్యాయి.
ఒక పార్టీలో కలిసిన వీరిద్దరు ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా స్నేహితులు అయ్యారట. ఫేస్ బుక్ లో కూడా ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా స్నేహితులుగా మారిన వీరిద్దరు మెల్ల మెల్లగా ఒకరిని ఒకరు తెలుసుకోవడం.. అర్థం చేసుకోవడం చేశారట. నిఖిల్ మొదటగా తన లవ్ ను ప్రపోజ్ చేశాడట. నిఖిల్ ఐ లవ్ యూ అని చెప్పిన సమయంలో పల్లవి జోక్ చేస్తున్నాడని అనుకుందట. నిఖిల్ అలా ప్రేమిస్తున్నా అని చెప్తాడని ఊహించలేదు అంది.
నిఖిల్ జోక్ చేస్తున్నాడని అనుకున్న తాను ఆ తర్వాత అర్థం చేసుకున్నాను. కాని వెంటనే ఓకే చెప్పకుండా ఇంట్లో వారితో మాట్లాడి వారు ఓకే అన్నతర్వాత మాత్రమే నేను నిఖిల్ ప్రేమకు ఓకే చెప్పాను అన్నట్లుగా ఆమె ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇంట్లో నిఖిల్ చాలా నార్మల్ గా ఉంటాడు అని చెప్పుకొచ్చింది. ఒక హీరోగా కాకుండా సింపుల్ గా మాట్లాడటం.. సింపుల్ లివింగ్ లైఫ్ ను నిఖిల్ ఇష్టపడతాడంది.
హ్యాపీ డేస్ టైమ్ లో తాను 8వ తరగతి చదువుతున్నట్లుగా చెప్పుకొచ్చింది. హ్యాపీడేస్ మరియు కార్తికేయ సినిమాలను మాత్రమే పెళ్లికి ముందు చూశాను. పెళ్లి తర్వాత కూర్చోబెట్టి తను నటించిన అన్ని సినిమాలను కూడా బలవంతంగా చూపించాడంటూ పల్లవి సరదాగా నవ్వేసింది. తమ వివాహ జీవితం చాలా సంతోషంగా ఉందని నిఖిల్ మరియు పల్లవి చెప్పుకొచ్చారు.
ఇక నిఖిల్ సినిమాల విషయానికి వస్తే అనుపమ పరమేశ్వరన్ తో కలిసి 18 పేజెస్ సినిమాలో నటించాడు. సుకుమార్ రైటింగ్స్ లో రూపొందిన ఆ సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. కరోనా వల్ల ఆలస్యం అవుతున్న సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది. మరో వైపు కార్తికేయ 2 సినిమా ను కూడా నిఖిల్ చేస్తున్నాడు. త్వరలోనే ఆ సినిమాను కూడా విడుదల చేయబోతున్నామని మేకర్స్ ప్రకటించారు.