తెరపై వెలుగులు విరజిమ్మే స్టార్లకి.. మరిన్ని ట్యాలెంట్ లు ఉంటాయి. వాటిని ఎప్పుడో కానీ బయటపెట్టరు. కొందరికి అసలు తమ రెండో ట్యాలెంట్ ని చూపే అవకాశం కూడా రాదు. కానీ ఇప్పుడు మాత్రం కొందరు తారలకు తమ గాన మాధుర్యాన్ని వినిపించే అవకాశం వచ్చింది. ఇప్పటికే ఎన్టీఆర్ - రవితేజ - శృతిహాసన్ లు పాటలు పాడేశారు. మరింత మంది కూడా ఈ జాబితాలో చేరారు. గత వారంలో ముగ్గురు స్టార్స్ ఇలా పాటలు పాడ్డం విశేషం.
సరైనోడు సినిమా కోసం బన్నీ ఓ ఎలక్ట్రానిక్ డ్యాన్స్ బీట్ పాడాడని ఇప్పటికే చెప్పుకున్నాం. మార్చ్ లో ఈ మూవీ ఆడియో వేడుక నిర్వహించనుండడంతో.. పాటలో బన్నీ వాయిస్ త్వరలో వినచ్చు. ఇక బాలీవుడ్ లో ఇప్పటికే సోనాక్షి సిన్హా - శ్రద్ధాకపూర్ - ఆలియా భట్ లు పాటలు పాడితే, ప్రియాంక చోప్రా ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఆల్బమ్స్ లో కూడా గాత్రం వినిపించింది. ఇప్పుడీ లిస్ట్ లోకి పరిణీతి చోప్రా కూడా చేరింది. మేరీ ప్యారీ బిందు అనే చిత్రం కోసం 'మనా కీ హమ్ యార్ నహీ' అనే పాటను పాడింది పరిణీతి.
ఇక కోలీవుడ్ లోనూ ఓ కొత్త సింగర్ వచ్చేసింది. తెలుగమ్మాయి అంజలి కోలీవుడ్ లో సింగర్ గా అకాశం ఎత్తడం విశేషం. తమిళ్ లో 'యార్ నీ' అనే టైటిల్ పై తెరకెక్తుతున్న ఈ సినిమా కోసం పాడేసింది అంజలి. తెలుగులో చిత్రాంగద అంటూ రానుంది ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ. మరి తెలుగులోనూ ఈ పాట అంజలి పాడుతుందేమో చూడాలి.