తెలుగు మరియు తమిళంలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా, గ్లామర్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన రమ్యకృష్ణ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్న విషయం తెల్సిందే. రమ్యకృష్ణ హీరోయిన్ గా స్టార్ డం తో దూసుకు పోతున్న సమయంలో రజినీకాంత్ హీరోగా నటించిన 'నరసింహా' అనే చిత్రంలో నెగటివ్ షేడ్స్ ఉండే నీలాంబరి అనే పాత్ర చేసింది. ఆ సినిమా విడుదలై ఇన్నేళ్లయినా కూడా నీలాంబరి పాత్ర గురించి ఇంకా చర్చించుకుంటూనే ఉంటాం అంటే ఆ పాత్ర ఎంత సూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రజినీకాంత్, సౌందర్య జంటగా నటించిన ఆ సినిమాలో రమ్యకృష్ణ నీలాంబరి పాత్రను పోషించి సినిమాకు హైలైట్ గా నిలిచింది.
ఆ సినిమాలో సౌందర్యను కొట్టడం, కాలితో తన్నడం వంటి సీన్స్ ను రమ్యకృష్ణ చేయాల్సి వచ్చిందట. ఆ సమయంలో తాను చాలా ఇబ్బంది పడ్డాను అని, షూటింగ్ జరుపుతున్నన్ని రోజులు కూడా నేను ఏదో తెలియని ఫీలింగ్ కు లోనయ్యేదాన్ని అంటూ తాజాగా రమ్యకృష్ణ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మొదట నేను నరసింహా చిత్రంలో సౌందర్య పోషించిన పాత్రను చేస్తానంటూ దర్శకుడిని అడిగాను. కాని ఆయన మాత్రం నీలాంబరి పాత్రకు నీవు అయితేనే బాగుంటుంది అంటూ పట్టుబట్టి నాతో ఆ పాత్రను చేయించాడు.
పొగరుబోతు పాత్రలో నేను నటించిన సమయంలో చాలా ఫీల్ అయ్యాను. ముఖ్యంగా సౌందర్య ముఖంకు కాలు తాకే సీన్స్, ఆమెను కొట్టే సీన్స్ ఇంకా కొన్ని సీన్స్ మరీ అతిగా ఉన్నాయనిపించింది. కొందరు సన్నిహితులు కూడా హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో ఇలాంటి పాత్రలు ఎందుకు అన్నారు. కాని దర్శకుడు కేఎస్ రవికుమార్ గారిపై నమ్మకంతో ఆ సినిమాను చేశాను. ఆ సినిమాను ఆయన తీసిన విధానం, నా పాత్రను చూపించిన విధంగా నిజంగా అద్బుతం. సినిమా చేస్తున్నన్ని రోజులు పడ్డ ఇబ్బంది, కష్టం అంతా కూడా సినిమా విడుదలై ఆ పాత్రకు ప్రశంసలు దక్కిన సమయంలో పోయాయి అంటూ రమ్యకృష్ణ పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంది.