​​శంకర్ ను కోరుతున్న బాహుబలి రైటర్

Update: 2017-07-30 05:09 GMT
సౌత్ ఇండియా ఇప్పుడు భారీ సినిమాలుకు కొలువుగా మారింది. గతంలో సౌత్ సినిమాలో భారీ సినిమాలు అంటే అందరికి గుర్తుకు వచ్చేది ఒక్క శంకర్ పేరు మాత్రమే. కానీ ఇప్పుడు ఆ పేరుతో పాటుగా మరో పేరు వినిపిస్తుంది. బాహుబలి సినిమాతో ఇండియా లోనే పెద్ద డైరెక్టర్ గా మారాడు రాజమౌళి. ఇప్పుడు ఇండియా అంతా వీళ్ళ సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయ చూద్దామా అని ఎదురుచూస్తూ ఉంటున్నారు.

బాహుబలి సినిమా రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానం  చూస్తే  అతని వినయం ఎంతటిదో అర్ధం అవుతుంది, ఒక మీడియా ఇంటర్వ్యూలో ‘డైరెక్టర్ శంకర్ మీ దగ్గరకు  వచ్చి అతని కోసం ఒక కథ రాయమని అడిగితే మీరు రాసి ఇస్తారా?’ అని అడగ్గా.. దానికి విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన సమాధానం చూడండి. “ఇది ప్రశ్నలా లేదు. ఎందుకంటే ఆయన నా దగ్గరకు వచ్చి కథ అడగడం కాదు నేనే ఆయన దగ్గరకు వెళ్ళి చేతులు జోడించి మరి అడుగుతాను నా కథను మీరు డైరెక్ట్ చేయండని“ అని చెప్పాడు. ఈ సమాధానంతో అక్కడ ఉన్న ప్రతీవారు ఆశ్చర్యప్డడ్డారట.

ఈ ప్రశ్న ఒక మామూలు ప్రశ్నే అయినా విజయేంద్ర ప్రసాద్ జవాబు మాత్రం గొప్పగా ఉంది. కొంతమంది సోషల్ మీడియాలో శంకర్ కు రాజమౌళి కి మధ్య పోలికలు వెతికి అనవసర చర్చలు చేస్తున్నారు. కొంతమంది రాజమౌళి గొప్ప అని మరి కొంతమంది శంకర్ గొప్ప అని నానా రబస చేస్తున్నారు. వాళ్ళందరికీ ఈ బాహుబటి రైటర్ ఒక ఆన్సర్ ఇచ్చేశాడు. విజయేంద్ర ప్రసాద్ ఇప్పుడు హిందిలో  విక్రమార్కుడు సినిమాకు సీక్వెల్ రాయడంలో బిజీ గా ఉన్నారు. దానితో పాటుగా  శంకర్ డైరెక్ట్ చేసిన సినిమా ఒకే ఒక్కడు కు కూడా హిందీలో సీక్వెల్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారట.

Full View
Tags:    

Similar News