ఇప్పుడు జగపతి బాబు అంటే.. అందరికీ సాల్ట్ పెప్పర్ లుక్ మాత్రమే గుర్తొస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో దుమ్ములేపుతున్న జగ్గూభాయ్.. తనలోని ఫ్యామిలీ హీరోను మరిపించారని చెప్పొచ్చు. అంతలా.. రిజిస్టర్ అయ్యింది ఆయన కాక్ టెయిల్ లుక్. బ్లాక్ అండ్ వైట్ హెయిర్ లుక్.. ఆడియన్స్ కు నచ్చడంతో దాన్నే కంటిన్యూ చేస్తున్నారు. అయితే.. ఉన్నట్టుండి క్లీన్ షేవ్ లో దర్శనమిచ్చారు జగ్గూ.
ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అప్పుడెప్పుడో దశాబ్దంన్నర క్రితం కనిపించిన సాఫ్ట్ జెంటిల్మన్ లుక్ ను.. ఆడియన్స్ కు మళ్లీ చూపించారు. ఈ మధ్య కాలంలో క్లీన్ షేవ్ తో జగ్గూభాయ్ ఎప్పుడూ కనిపించలేదు. అలాంటిది.. ఉన్నట్టుండి గడ్డం తీసేసి నున్నగా కనిపించడంతో అందరూ ‘వావ్’ అంటున్నారు.
ఇక, ఈ లుక్ లో కనిపించడానిక కారణమేంటన్నది ఎవ్వరూ అడగకుండానే చెప్పేశారు జగపతి బాబు. లాక్ డౌన్ కారణంగా షూటింగులన్నీ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు సినిమా ఇండస్ట్రీ మొత్తం షూటింగులకు ప్యాకప్ చెప్పేసి, ఇంట్లో సేద తీరుతోంది. ఇంట్లో ఉండీ ఉండీ బోర్ కొట్టిందట జగ్గూభాయ్ కి. అందుకే.. సమ్ థింగ్ డిఫరెంట్ అన్నట్టు గడ్డం గీసేశాడన్నమాట.
తనకు పనిలేక ఈ పనిచేశానంటూ తనపై తానే సెటైర్ వేసుకుని ఫన్ క్రియేట్ చేశారు. ఒకటీ రెండు కాదు.. ఏకంగా ఏడేళ్ల తర్వాత ఇలా క్లీన్ షేవ్ చేసుకున్నారట. ఇన్నేళ్లూ ట్రిమ్మింగ్ తో నడిపించారన్నమాట. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.