కేతిక శర్మ.. ఈ యంగ్ బ్యూటీ గురించి పరిచయాలు అవసరం లేదు. ఢిల్లీలో జన్మించిన ఈ అందాల భామ.. డబ్ స్మాష్ వీడియోలు, మోడలింగ్, యూట్యూబ్ వీడియోలతో సినిమాల్లోకి రాకముందే సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా తెరకెక్కిన 'రొమాంటిక్' చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది.
ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. కేతిక మాత్రం తనదైన నటన, గ్లామర్ షోతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత 'లక్ష్య'తో అందరినీ పలకరించింది. నాగ శౌర్య హీరోగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం పెద్దగా అలరించలేకపోయింది. దీంతో ఇప్పుడు కేతిక ఆశలన్నీ తన నెక్స్ట్ మూవీ అయిన 'రంగ రంగ వైభవంగా' మీదే పెట్టుకుంది.
ఇందులో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించాడు. తమిళంలోకి 'అర్జున్ రెడ్డి'ని రీమేక్ చేసిన గిరీశాయ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. బాపినీడు.బి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యానర్‌పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఇది.
ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. అనేక వాయిదాల అనంతరం సెప్టెంబర్ 2న గ్రాండ్ రిలీజ్ అయ్యేందుకు ముస్తాబవుతోంది. పైగా ఆ రోజు వైష్ణవ్ మావయ్య, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో..ఈ సినిమా మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్లు, పాటలు, టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
మరోవైపు ప్రచార కార్యక్రమాలతో సినిమాపై మేకర్స్ భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా మినహా మరే ప్రాజెక్ట్ కేతిక చేతిలో లేదు. కానీ, ఈ మూవీ గనుక క్లిక్ అయితే కేతిక దశ తిరుగుతుందని, ఆమెకు స్టార్ హీరోల నుంచి కాకపోయినా టైర్-2 హీరోల నుంచి వరుస ఆఫర్లు తలుపు తట్టడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి కేతిక 'రంగ రంగ వైభవంగా'తో హిట్ కొట్టి.. మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటుందా.. లేదా.. అన్నది చూడాలి.