బ్రహ్మస్త్ర - కేజీఎఫ్ కాంబినేషన్ కలిస్తే ఉంటది సామిరంగ..!

Update: 2022-10-28 17:30 GMT
కన్నడ సూపర్ స్టార్ యష్ 'కేజీఎఫ్-1' మూవీతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కేజీఎఫ్' మూవీ ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టింది. ఈ చిత్రం కన్నడలోనే కాకుండా విడుదలైన అన్ని భాషల్లో భారీ కలెక్షన్లు రాబట్టింది. కేజీఎఫ్-1 భారీ విజయంతో హీరో యష్ ఓవర్ నైట్లో ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.

కేజీఎఫ్-1 చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సుమారు 230 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఇక ఈసినిమా సీక్వెల్ గా వచ్చిన 'కేజీఎఫ్-2' అంతకు మించి ప్రేక్షకుల ఆదరణ పొందింది. తెలుగు.. కన్నడ.. హిందీ.. తమిళ్.. మలయాళీ భాషల్లో 'కేజీఎఫ్-2' భారీగా వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్-2 సినిమాకు 1200 కోట్ల గ్రాస్ వచ్చినట్లు అంచనా.

'కేజీఎఫ్-2' తర్వాత యష్ తదుపరి సినిమాపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే తాజాగా 'బ్రహ్మస్త్ర-2'లో యష్ నటించబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పోస్ట్ కోవిడ్ తర్వాత బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో 'బహ్మస్త్ర' ఒకటిగా నిలుస్తోంది.

ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సుమారు 400 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. 'బహ్మస్త్ర-1' దేవ్ పాత్రను పరిచయం చేస్తూ అద్భుతంగా ముగిసింది. దీంతో దేవ్ పాత్రలో ఎవరు నటిస్తారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. తాజా సమాచారం మేరకు ఈ సినిమా నిర్మాతలు దేవ్ పాత్ర కోసం యష్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది.

'బ్రహ్మస్త్ర-2'లో యష్ నటిస్తే సినిమా హైప్ మరింత పెరుగుతుందని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు. యష్ వల్ల దక్షిణాదిలో 'బ్రహ్మస్త్ర-2' కు మరింత మార్కెట్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో ఈ సినిమాలో అతడిని భాగం చేయాలని 'బ్రహ్మస్త్ర' టీం ప్రయత్నాలు మొదలు పెట్టింది.  

హీరో యష్ నిజంగా 'బ్రహ్మస్త్ర-2' భాగమైతే మాత్రం 'బాహుబలి' రికార్డులు బ్రేక్ కావడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే 'కేజీఎఫ్-3' అప్డేట్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. దీంతోపాటు దర్శకుడు నాథన్ తో యష్ తదుపరి సినిమా ఉండబోతుందనే ప్రచారం జరుగుతోంది. వీటిపై యష్ ఎలాంటి క్లారిటీ ఇస్తాడో వేచి చూడాల్సిందే..!



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News