'RRR' ట్రైల‌ర్ అయితే..'ఆదిపురుష్' అస‌లు సినిమా!

Update: 2022-03-29 14:30 GMT
ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన పాన్ ఇండియా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` స‌క్సెస్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. మొద‌టి రోజే `బాహుబ‌లి రికార్డుల‌ను బ‌ద్ద‌లుకొట్టి బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డుని లిఖించింది. స్టిల్ `ఆర్ ఆర్ ఆర్` విధ్వంసం కొన‌సాగుతోంది. మార్చి 25న రిలీజ్ అయిన సినిమా వ‌సూళ్ల సునామీ కొన‌సాగిస్తుంది. ఒక్క నార్త్ మిన‌హా అన్ని చోట్లా `ఆర్ ఆర్ ఆర్` మంచి వ‌సూళ్ల‌ని సాధిస్తుంది.

మొద‌టి షో టాక్ తోనే` బాహుబ‌లి` ప్రాంజైజీ నిర్మాత శోభు య‌ర్ల‌గ‌డ్డ ఏకంగా ఇకపై నాన్ `బాహుబ‌లి` కి బ‌ధులుగా `నాన్ ఆర్ ఆర్ ఆర్` అని పిల‌వాల్సి ఉంటుంద‌ని మెచ్చారు. `ఆర్ ఆర్ ఆర్` లో కొన్ని ఎమోష‌న‌ల్ స‌న్నివేశాల హౌలైట్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. క‌థ‌లో అద్భుత‌మైన ఎమోష‌న్ ని  పండించారు. ఆ భావోద్వేగ‌పూరిత స‌న్నివేశాల‌కు కొంత మంది ఫ్యాన్స్ క‌న్నీటి ప‌ర్యంతం అయిన సంద‌ర్భాలున్నాయి.

తాజాగా `ఆర్ ఆర్ ఆర్` ని మించి `ఆదిపురుష్` ఉంటుందంటూ ఆర్ ఎస్ ఎస్ స్వామిసేవ‌క్..బీజేపీ మీడియా స్పోక‌ర్ ప‌ర్స‌న్ ఎస్. జీ సూర్యాహ్ ట్విటర్ వేదిక‌గా అభిప్రాయ‌ప‌డ్డారు.

'ఆర్ ఆర్ ఆర్' టాలీవుడ్ లో తెర‌కెక్కిన చిత్రం కాబ‌ట్టి ``ద్రవిడలు తమ కన్నీళ్లను అలాగే ఉంచుకోవాల‌ని అభ్యర్థించారు.  జనవరి 2023లో విడుదల కానున్న #ఆదిపురుష్  లో అంత‌టి ఎమోష్ ఉంటుంది. #RRR ట్రైలర్ అయితే.. #రామాయణం అస‌లైన‌ల సినిమా అవుతుంది` అన్న మీనింగ్ తో ఓ పోస్ట్ చేసారు.

ప్ర‌స్తుతం ఈ పోస్ట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. సూర్యాహ్ హిందు  వాది కావ‌డంతోనే..హిందు సంస్కృతిపై త‌న‌కున్న ప్రేమ‌ని ఇలా చాటుకుంటున్నార‌ని నెటి జ‌నులు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. `ఆదిపురుష్`  ఇతిహాసం రామాయ‌ణం ఆధారంగా తెర‌కెక్కుతోన్న చిత్రం. ఇప్ప‌టికే షూటింగ్  పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి.

ఇదే ఏడాది ఆగ‌స్ట్ లో రిలీజ్ అవుతుంద‌ని అంతా భావించారు. కానీ సినిమా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి వ‌ర‌కూ వాయిదా ప‌డింది. 2023 జ‌న‌వ‌రి 12న చిత్రం రిలీజ్ కానుంది.  అప్ప‌టివ‌ర‌కూ పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ అభిమానులు వెయిట్ చేయాల్సిందే.  ఇందులో ప్ర‌భాస్ రాముడి పాత్ర‌లో న‌టించారు. ఆయ‌న‌కు జంట‌గా సీత పాత్ర‌లో కృతి స‌న‌న్ న‌టించింది. రావ‌ణుడి పాత్ర‌లో సైఫ్ అలీఖాన్ క‌నిపించ‌నున్నారు. ఇంకా ఎంతో మంది బిగ్ స్టార్స్ `ఆదిపురుష్` లో భాగ‌మ‌య్యారు.

`ఆదిపురుష్` కోసం 7000 సంవ‌త్స‌రాల క్రితం నాటి సెట్లు సైతం నిర్మించారు. రామాయ‌ణానికి సంబంధించిన ప్ర‌తీ పాయిట్ ని సినిమాలో ట‌చ్ చేసారు. దానికి ఆధునిక సాంకేతిక‌ను జోడించి త‌మ‌దైన శైలిలో తెర‌కెక్కించిన‌ట్లు ద‌ర్శ‌కుడు ఓరౌంత్ వెల్ల‌డించారు. 500 కోట్ల బ‌డ్జెట్ తో  చిత్రాన్ని టిసిరీస్-రెట్రో ఫిల‌సైస్ సంయుక్తంగా నిర్మించాయి.  హిందీ.. తెలుగు ..త‌మిళం..మ‌ల‌యాళం..క‌న్న‌డ భాష‌ల్లో చిత్రం విడుద‌ల కానుంది.
Tags:    

Similar News