దర్శకధీరుడు రాజమౌళి 'బాహుబలి' తర్వాత చాలా గ్యాప్ తీసుకొని తెరకెక్కిస్తున్న భారీ చిత్రం 'ఆర్.ఆర్.ఆర్'. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మన్నెం దొర అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటిస్తున్నారు. అలియా భట్ - ఒలీవియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మల్టీస్టారర్ ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఇప్పటికే మూడుసార్లు విడుదల తేదీలను మార్చుకుంది. చివరగా 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని 2021 సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల చేస్తామని ప్రకటించారు.
అయితే కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో అనుకున్న సమయానికి 'ఆర్.ఆర్.ఆర్' సినిమా షూటింగ్ పూర్తి చేయలేకపోయారు. దీంతో జనవరి 8న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోయారు. ఈ నేపథ్యంలో ముందుగా ప్రకటించినట్లు ఈరోజు(జనవరి 8) సినిమా రిలీజ్ అయ్యేదనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. థియేటరర్స్ లో 'ఆర్.ఆర్.ఆర్' సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లున్నట్లు.. రివ్యూలు ఇస్తున్నట్లు పోస్టులు పెడుతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ రోజు థియేటర్ల ముందు సెలబ్రేషన్స్ ఓ రేంజులో ఉండేవని కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు 2021 అంటే 2031 అన్నమాట ఫన్నీ పోస్టులు పెడుతున్నారు. ఏదేమైనా 'ఆర్.ఆర్.ఆర్' కోసం సినీ అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు.
ఇదిలా ఉండగా కోవిడ్ నేపథ్యంలో 'ఆర్.ఆర్.ఆర్' షూటింగ్ తిరిగి ప్రారంభించిన రాజమౌళి.. శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన హీరోల ఇంట్రో వీడియోలతో అంచనాలు తారాస్థాయికి చేర్చిన జక్కన్న.. దానికి తగ్గట్టే ఈ చిత్రాన్ని విజువల్ వండర్ లా తీర్చిదిద్దుతున్నాడు. ఈ చిత్రానికి సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా.. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ - శ్రియా - సముద్రఖని వంటి స్టార్స్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 'ఆర్.ఆర్.ఆర్' ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.