ఛాన్స్ ఉంటే ఆడపిల్లని కనాలని ఉంది: అనసూయ

Update: 2021-05-19 03:30 GMT
బుల్లితెరపై యాంకర్ గా హవా కొనసాగిస్తున్న అనసూయ.. వెండితెరపై కూడా సత్తా చాటుతోంది. ఓ వైపు టీవీ ప్రోగ్రామ్స్ - సినిమాలతో బిజీగా గడుపుతూనే.. మరోవైపు తన ఇద్దరు పిల్లల ఆలనాపాలనా చూసుకుంటోంది. ఇలా కెరీర్ ని పర్సనల్ లైఫ్ ని బ్యాలన్స్ చేసుకుంటూ వెళ్తోంది. ఇక ఏ విషయాన్నైనా నిర్భయంగా వెల్లడించే అనసూయ.. మరోసారి మాతృత్వాన్ని అనుభవించాలనే కోరికను వెలిబుచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. ఈ సందర్భంగా టైం కుదిరితే ఛాన్స్ ఉండే ఆడపిల్లని కనాలని ఉందని తెలిపారు.

మాతృత్వం అనుభూతి తనకు చాలా ఇష్టమని.. సూపర్ పవర్ లాగా ఫీల్ అవుతానని.. ఒకరికి జన్మనివ్వడం సూపర్ పవర్ అని అనసూయ వెల్లడించారు. టైం కుదిరితే ఛాన్స్ ఉండే ఆడపిల్లని కనాలని ఉందని చెప్పుకొచ్చింది. ఒకవేళ పాప పుడితే జీవితంలో ఎక్కువ స‌మ‌యం తన బాధ్య‌త‌లు చూసుకోవ‌డానికే కేటాయిస్తానని.. అమ్మాయిని పెంచి పోషించ‌డంలో ఓ థ్రిల్ ఉంద‌ని చెబుతోంది. త‌న ప్రేమ‌క‌థ‌లో చాలా మ‌సాలా ఉంద‌ని.. ఎప్ప‌టికైనా త‌న క‌థ‌ని సినిమాగా తీస్తాన‌ని అన‌సూయ‌ అంటోంది.

ఇక సినిమాల విషయానికొస్తే.. అనసూయ ఇటీవల 'థాంక్ యు బ్రదర్' సినిమాలో నిండు గర్భిణీగా నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆమె పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న 'పుష్ప' సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. అలానే 'ఖిలాడి' 'రంగమార్తాండ' 'ది చేజ్'  వంటి సినిమాలలో అనసూయ నటిస్తోంది.
Tags:    

Similar News