ఇదే కనుక నిజమైతే బుచ్చిబాబు అదృష్టవంతుడే..!

Update: 2021-04-18 02:30 GMT
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో 30వ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దర్శకుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తో చేయాల్సిన సినిమా క్యాన్సిల్ అవడంతో తారక్ వెంటనే కొరటాల ను లైన్ లోకి తెచ్చాడు. ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న 'ఆర్.ఆర్ ఆర్' సినిమా కంప్లీట్ అయిన తర్వాత '#NTR30' ప్రాజెక్ట్ సెట్స్ పైకి రానుంది. అయితే దీని త‌రువాత బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్నాడని ఈ మధ్య వార్తలు వస్తున్నాయి.

'ఉప్పెన' సినిమాతో సక్సెస్ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు.. ఎన్టీఆర్ నటించిన 'నాన్నకు ప్రేమతో' చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. ఆ పరిచయంతో 'ఉప్పెన' స్టోరీ ముందుగా తారక్ కే చెప్పానని బుచ్చిబాబు ఇటీవల వెల్లడించాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బుచ్చిబాబు ఓ స్టోరీ లైన్ వినిపించారని.. దీనికి ఎన్టీఆర్ సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందని టాక్ నడుస్తోంది. ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ - సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి నిర్మిస్తాయని.. బుచ్చిబాబు ప్రస్తుతం ఫైనల్ స్క్రిప్టును రెడీ చేసే పనిలో ఉన్నాడని అంటున్నారు.

ఇదే కనుక నిజమైతే బుచ్చిబాబు అదృష్టవంతుడనే చెప్పాలి. తన రెండో సినిమాకే ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోని డైరెక్ట్ చేసే అవకాశం దక్కడం అంటే మామూలు విషయం కాదు. అయితే 'ఆర్.ఆర్.ఆర్' లాంటి పాన్ ఇండియా సినిమా తర్వాత తారక్ అన్నీ అదే స్థాయిలో ఉండేలా సబ్జెక్ట్స్ ఎంచుకుంటున్నాడు. కొరటాల శివతో అనౌన్స్ చేసిన సినిమా కూడా పాన్ ఇండియా లెవల్ లో రూపొందనుంది. ఈ నేపథ్యంలో ఒక్క సినిమా అనుభవం ఉన్న బుచ్చిబాబు ఎన్టీఆర్ ని హ్యాండిల్ చేయగలడా అనేది చూడాలి.
Tags:    

Similar News