ఇక పెళ్లిళ్లకు రానంటున్న హీరో

Update: 2018-09-26 14:08 GMT
స్టార్ హీరోలు ఎంత సోషల్ లైఫ్ లోకి రావాలి అనుకున్నా అశేషంగా పెరిగిన అభిమానుల వల్లే ఆ కోరికను తీర్చుకోలేకపోతున్నారు. అడుగు బయట పెట్టడం ఆలస్యం చుట్టుముట్టే ఫ్యాన్స్ తాకిడిని భరించడం రాను రాను చాలా  కష్టంగా మారుతోంది. ఆ మధ్య రామ్ చరణ్ రంగస్థలం కోసం గోదావరి జిల్లాల్లో షూటింగ్ చేస్తున్నప్పుడు జనం రాకను కంట్రోల్ చేయలేక షెడ్యూల్ ని ఏకంగా హైదరాబాద్ కు మార్చి సెట్ వేయాల్సి వచ్చింది. ఇది అందరు హీరోలకు అనుభవమయ్యేదే.

ఇటీవలే పాండిచ్చేరిలో హీరో విజయ్ తన అభిమాన సంఘం కార్యదర్శి ఆనంద్ కూతురి పెళ్ళికి సతీసమేతంగా వెళ్ళినప్ప్పుడు ఎంత రచ్చ జరిగిందో వీడియో రూపంలో చూసాం. విజయ్ కు సైతం స్వల్ప గాయాలయ్యాయి. విజయ్ వస్తున్నాడని తెలిసి వేల సంఖ్యలో వచ్చిన అభిమానులను నియంత్రించలేకపోవడంతో ఫంక్షన్ హాల్ లో ఉన్న ఫర్నీచర్ సైతం ధ్వంసం అయ్యింది. ఆఖరికి పెళ్ళికి వచ్చిన అతిధులు బంధువులు భోజనం చేసేందుకు కూడా అవకాశం లేక నిరాశగా వెనుదిరిగారు. ఇది మీడియాలో బాగా హై లైట్ అయ్యింది.

దీంతో  విజయ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై తన అభిమానులదైనా సరే ఏ పెళ్ళికి వెళ్లకూడదని డిసైడ్ అయ్యాడు. ఆ మేరకు తన అభిమాన సంఘాలకు సమాచారం కూడా పంపించాడు. ఒకవేళ ముఖ్యం అనుకుంటే ఇంటికి పిలిపించి విష్ చేసి అక్కడే గిఫ్ట్ తో పాటు ఫోటో సెషన్ తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాడట. మొన్న తన రాక వల్ల జరిగిన అసౌకర్యం రచ్చ మళ్ళి రిపీట్ కాకూడదు అంటే ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని అందులో పేర్కొన్నాడు. ఇది అవసరమైన నిర్ణయమే. లేకపోతే హీరోలు దేనికోసం వస్తున్నారో అన్న విచక్షణ మర్చిపోయి హీరోని ఫోటోలు తీసుకోవడం కోసం దగ్గరి నుంచి చూడటం కోసం ఆత్ర పడటం వల్ల ఇలాంటి చిక్కులు వస్తాయి.

విజయ్ మురుగదాస్ కాంబోలో రూపొందుతున్న సర్కార్ షూటింగ్ ముగింపుకు వచ్చింది. నవంబర్ రెండో వారంలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన సర్కార్ లో వరలక్ష్మి శరత్ కుమార్ మరో కీలక పాత్ర పోషించింది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సర్కార్ మీద అన్ని భాషల్లో కలిపి 200 కోట్లకు పైగా బిజినెస్ జరుగుతుందని అక్కడి ట్రేడ్ టాక్. మురుగదాస్ విజయ్ ల హ్యాట్రిక్ మూవీ కావడంతో అంచనాలు రెట్టింపవుతున్నాయి.
Tags:    

Similar News