ఫిల్మిండ‌స్ట్రీ క్రూర‌త్వంపై ఇలియానా కామెంట్స్

Update: 2021-05-30 12:02 GMT
సినీరంగంలో సుమారు 15ఏళ్లుగా కెరీర్ ని సాగిస్తోంది ఇలియానా. ఇటీవ‌ల ఈ గోవా బ్యూటీ కెరీర్ ఏమంత బాలేదు. వ‌రుస వైఫ‌ల్యాలు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. మొన్న‌టికి మొన్న అభిషేక్ బ‌చ్చ‌న్ తో క‌లిసి న‌టించిన ది బిగ్ బుల్ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయ‌డంతో త‌న‌వంతు ప్ర‌చారం కోసం త‌పించింది.

తాజాగా ఇలియానా సినీప‌రిశ్ర‌మ క్రూర‌త్వంపై ఓపెనైంది. ఇక్కడ ప‌రిస్థితులు క్రూరంగా ఉంటాయ‌ని ఒక్కోసారి క‌ఠిన‌మైన ద‌శ‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని వెల్ల‌డించింది. అయితే ఎంత క‌ఠిన‌మైన ప‌రిశ్ర‌మ అయినా కానీ కొన్ని అవ‌కాశాలిచ్చి ప్రోత్స‌హిస్తుంద‌ని పాజిటివ్ విష‌యాన్ని ఇలియానా ప్ర‌స్థావించింది.

వ్యాపారం అంటే లాభ‌న‌ష్టాల్ని భేరీజు వేసేది. న‌ష్ట‌పోతే ప‌రిశ్ర‌మ ఆద‌రించ‌దని తెలిపింది.  సినిమా బిజినెస్ లో ఉన్న క్రూరత్వం గురించి మాట్లాడుతూ- ప్రతిదీ ప్ర‌జ‌లంద‌రికీ వ‌ర్తిస్తుంది. ఒక కళాకారుడిగా ప్రేక్షకులు మ‌న‌ల్ని మ‌న సినిమాలు చూడాల‌ని కోరుకుంటాం. కానీ సినీ పరిశ్రమలో మనుగడ అంత సులువేమీ కాదు. చాలా క్రూరమైన ప్రదేశంగా ఉంటుందనే వాస్తవాన్ని తెలుసుకోవాలి`` అని ఇల్లీ అనుభ‌వ పూర్వ‌కంగా వ్యాఖ్యానించింది.

ఏదేమైనా ఇలియానా డి క్రజ్ ఈ ఎదురుదెబ్బలను బహిరంగంగా అంగీకరించింది. న‌టిగా ఈ పరిశ్రమలో నిలబడటానికి ఉన్న ఇబ్బందులను ఆమె అర్థం చేసుకుంది. ప్రియుడితో బ్రేక‌ప్ అవ్వ‌డం వ్య‌క్తిగ‌తంగా ఇలియానాను తీవ్రంగా కుంగుబాటుకు గురి చేసింది. ప్ర‌స్తుతం ఇలియానా ర‌ణ‌దీప్ హుడా స‌ర‌స‌న ఓ చిత్రంలో న‌టిస్తోంది. అలాగే త‌న రెస్టారెంట్ బిజినెస్ .. చాక్లెట్ బిజినెస్ ల‌ను విస్త‌రించే ప్ర‌య‌త్నంలో ఉంది.
Tags:    

Similar News