టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన సన్నజాజి సోయగం ఇలియానా గురించి పరిచయం అవసరం లేదు. తొలి సినిమా `దేవదాస్` దగ్గర నుంచి కుర్రాళ్లని టార్గెట్ చేసింది. అటుపై అంది వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వైనం ప్రశంసనీయం. `పొకిరి`తో కుర్రాళ్ల గుండెల్లో కాపురమే పెట్టేసింది. దశాబ్ధం పాటు టాలీవుడ్ ని ఏలింది. అయితే కెరీర్ పీక్స్ లో ఉండగానే బాలీవుడ్ కి వెళ్లిపోయింది. అక్కడా ఇలాగే దున్నేయాలని ప్లాన్ చేసింది.
ఆరంభంలో బ్యాక్ టూ బ్యాక్ బాగానే అవకాశాలు..సక్సెస్లు అందుకుంది. కానీ టాలీవుడ్ లో సక్సెస్ అయినంతగా బాలీవుడ్ లో సక్సెస్ అవ్వలేదు. ఇదే సమయంలో ఆండ్రూ నిబోన్ తో ప్రేమలో పడింది. కొన్నాళ్ల పాటు ఆ జీవితం సాపీగా సాగింది. ఈ క్రమంలో కెరీర్ ని సైతం అశ్రద్ద చేసింది. పెళ్లికి ముందే గర్భం దాల్చినట్లు మీడియా కథనాలు అంకంతకు హీటెక్కించాయి. అబార్షన్ చేయించుకుంటుందని..ఆత్మహత్యకు సైతం ప్రేరేపించిందని ప్రచారం సాగింది.
వీటిపై ఆ వెంటనే వివరణ ఇచ్చింది. అసలు నేనెప్పుడూ సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించలేదు.. చచ్చిపోలేదు.. బతికే ఉన్నాను అని నవ్వేసింది. ఇదంతా గతం. ఇటీవలే బోయ్ ప్రెండ్ కి దూరమైంది. దీంతో కాస్త డిప్రెషన్ కి గురైనట్లు మీడియా లో కథనాలు వెలువడ్డాయి. ఇప్పుడిప్పుడే వాటి నుంచి బయట పడుతుంది. ప్రస్తుతం ఇలియానా బొద్దు ఎక్కింది. దీంతో బాడీ షేమింగ్ పై షరా మూములుగా కామెంట్లు ..మీమ్స్ పడుతున్నాయి.
అయితే తాజాగా ఇలియానా మరోసారి ఆత్మహత్య గురించి స్పందించి షాక్ ఇచ్చింది. ``ఇటీవలే ఓ ఆర్టికల్ చదివాను. అందులో కంటెంట్ లేదు. పనికిమాలిన చెత్త విషయం ఉంది. నాకు 12 ఏళ్ల వయసు నుంచే శరీర సమస్యలు ఉన్నాయి. ఆ విషయంలో ఇప్పటికీ జాగ్రత్త పడుతుంటాను. ఇదే విషయంలో కొన్నేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు సహా పరిస్థితులు అలా ప్రేరేపించాయి. అంతేకానీ లావుగా ఉన్నానని చచ్చిపోవాలనుకోలేదు అని మీమ్స్ పై మండిపడింది.
సూసైడ్ మ్యాటర్ కొన్నేళ్ల క్రితమే తెరపైకి వచ్చింది. అప్పుడు సైలైంట్ గా ఉండి ఇప్పుడెందుకు ఆ గట్టు విప్పినట్లు అంటూ కొంత మంది సందేహిస్తున్నారు. ఇక నటిగా ఇలియానా బాలీవుడ్ లో రెండు..మూడు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో చివరిగా `అమర్ అక్భర్ ఆంటోని` లో నటించింది. కానీ ఆ సినిమా వైఫల్యంతో ఇలియానా ఎఫెర్ట్ అంతా వృదా అయింది.