ల‌వ్వ‌ర్‌ తో ఉంటే ఇంత దూర‌మేంటి ఇల్లీ?

Update: 2015-11-26 08:57 GMT
స‌న్న‌జాజి మొగ్గ ఇలియానాకు కోపం వ‌చ్చింది. త‌న పాటికి తాను హ్యాపీగా ఉంటే..ప‌ని క‌ట్టుకొని మ‌రీ త‌న‌పై లేనిపోని వ‌దంతులు సృష్టిస్తున్నారంటూ మండిప‌డుతోంది. త‌మిళ తంబీల‌ను ఆక‌ట్టుకోలేని ఈ నాజూకు భామ‌.. టాలీవుడ్ లో త‌న అందాల‌తో ఎంత‌గా అల‌రించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. టాప్ హీరోయిన్స్ లో ఒక‌రిగా వెలుగుతున్న రోజుల్లో బాలీవుడ్‌ పై క‌న్నేసి వెళ్లిపోయిన గోవా సుంద‌రికి అక్క‌డ బ‌ర్ఫీ సినిమా గురుతులు మాత్ర‌మే మిగిలాయి.

అటు హిందీలో అవ‌కాశాల్లేక‌.. తెలుగు మీద ఫోక‌స్ చేయ‌లేక కిందామీదా ప‌డిన ఇలియానా.. చివ‌ర‌కు ఒక విదేశీయుడి ప్రేమ‌లో ప‌డింది. వీరి ప్రేమ‌కు సంబంధించిన క‌బుర్లతో పాటు.. అప్పుడ‌ప్ప‌డు కాస్త ఘాటైన విష‌యాలు చెబుతూ.. ఇల్లీ బేటీ సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని త‌ర‌చూ వార్త‌ల్లో క‌నిపించేది. తాజాగా మ‌రో త‌ర‌హా వార్త‌లతో ఇలియానా వెలుగులోకి వ‌చ్చింది. అదేమంటే.. ఫారిన్ ల‌వ్వ‌ర్ కు బైబై చెప్పేసి.. బాలీవుడ్ న‌టుడితో డేటింగ్ చేస్తున్న‌ట్లుగా గాసిప్స్ పుట్టాయి. ఇది కాస్త అమ్మ‌డి చెవిన ప‌డి అగ్గి మీద గుగ్గిలం అవుతోంది.

సినిమా న‌టుల‌న్నాక చాలానే రూమ‌ర్లు షికార్లు  చేస్తుంటాయి. అందుకు ఇలియానా మిన‌హాయింపేమీ కాదు. త‌న‌పై వచ్చే గాసిప్స్ ను లైట్ అన్న‌ట్లుగా ఉండే ఆమె.. తాజా వార్త‌ల‌పై మాత్రం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. తాను.. త‌న ల‌వ్వ‌ర్‌తోనే ఉన్నాన‌ని.. ప‌ని మీద కొద్దిరోజులుగా త‌న ల‌వ్వ‌ర్ ఆస్ట్రేలియాకు వెళ్ల‌టంతో దూరంగా ఉన్నామే త‌ప్పించి.. త‌మ బంధం బ్రహ్మాండంగా ఉంద‌ని చెప్పుకొచ్చింది. నిజంగా అలాంటి ప‌రిస్థితే ఉంటే.. క‌నీసం వీకెండ్స్ లో అయినా ల‌వ్వ‌ర్ తో గ‌డిపేందుకు ఫారిన్ వెళ్లి రావొచ్చుగా  అన్న వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రి.. ఈ మాట‌ల‌కు ఇల్లీ బేబీ ఏమంటుందో..?
Tags:    

Similar News