హీరోయిన్‌ ను నమ్మించి మోసం చేసిన ఆ హీరో ఎవరబ్బా?

Update: 2020-04-21 23:30 GMT
దేవదాస్‌ చిత్రంతో తెలుగులో పరిచయం అయిన ముద్దుగుమ్మ ఇలియానా తక్కువ సమయంలోనే సౌత్‌ లో స్టార్‌ హీరోయిన్‌ గా ఎదిగింది. సౌత్‌ లో స్టార్‌ హీరోల సినిమాల్లో ఛాన్స్‌ వస్తున్న సమయంలోనే ఈమె బాలీవుడ్‌ కు వెళ్లి పోయింది. బాలీవుడ్‌ లో కొన్నాళ్ల పాటు సందడి చేసినా ఆ తర్వాత ఆమె అక్కడ ప్రాభవం కోల్పోయింది. మళ్లీ సౌత్‌ కు వచ్చే ప్రయత్నాలు చేసినా కూడా వర్కౌట్‌ కాలేదు. ఇంకా కూడా టాలీవుడ్‌ లేదా కోలీవుడ్‌ లో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆమద్య ఈ అమ్మడు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను ఒక సౌత్‌ హీరో మోసం చేశాడంటూ చెప్పుకొచ్చింది.

ఇలియానా పాత ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. సోషల్‌ మీడియాలో ఇలియానా పాత క్లిప్పింగ్స్‌ ఇప్పుడు తెగ షేర్‌ అవుతున్నాయి. ఆ ఇంటర్వ్యూలో తాను ఒక సౌత్‌ హీరో చేతిలో మోస పోయాను. ఆయన వల్ల ఆర్థికంగా.. శారీరకంగా.. మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఆయన వల్ల నేను పడ్డ ఇబ్బందుల కారణంగానే సౌత్‌ సినిమాను వదిలి పెట్టాల్సి వచ్చింది.

ఆయన బారి నుండి చాలా త్వరగానే బయట పడ్డాను అంటూ చెప్పిన ఇలియానా అతడు ఎవరు అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేదు. దాంతో ఇప్పుడు ఆ సౌత్‌ హీరో ఎవరై ఉంటారా అంటూ చర్చ జరుగుతోంది. ఇలియానా తెలుగులో ఎక్కువగా సినిమాలు చేసింది కనుక ఆమెను మోసం చేసింది తెలుగు హీరో అయ్యి ఉంటాడా అనే అనుమానాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమయంలోనే ఇలియానా గతంలో సౌత్‌ లో ఎవరితో సినిమాలు చేసింది అనే విషయాన్ని నెట్టింట సెర్చ్‌ చేసి మరీ ఆ హీరో ఎవరో కనిపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కొందరు. మరి ఇలియానా పబ్లిసిటీ కోసం చెప్పిందా లేదంటే నిజంగానే ఆమె సౌత్‌ హీరో వల్ల ఇబ్బందులు పడినదో మళ్లీ ఆమె నోరు తెరిస్తే కాని తెలియదు.
Tags:    

Similar News