ఈ మధ్య ఇండియన్ హీరోయిన్లకు లోకల్ కుర్రాళ్లెవరూ నచ్చట్లేదు. వరుస బెట్టి ఒక్కొక్కరు విదేశీయులతో ప్రేమలో పడుతున్నారు. వాళ్లనే పెళ్లి కూడా చేసుకుంటున్నారు. ఇలియానా కూడా అదే బాటలో నడిచింది. ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో ఆమె ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరూ సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి. అదెంత వరకు నిజమో తెలియదు. ఆ సంగతలా వదిలేస్తే.. ఇలియానా కోసం ఆండ్రూ కొన్నేళ్లుగా ఎక్కువగా ఇండియాలోనే గడుపుతున్నాడు. ఆమెతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. సన్నీ లియోన్ భర్త డేనియల్ వెబర్ లాగే ఆండ్రూ సైతం ఇక్కడే సెటిలైపోయే ఆలోచనల్లో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఫొటోగ్రఫీతో పాటు మరో కెరీర్ కూడా ఎంచుకోవాలని అతను చూస్తున్నట్లుగా ఉంది.
ఇలియానా సపోర్టుగా బాలీవుడ్ సినిమాల్లో వెలిగిపోవాలని ఆండ్రూప్రయత్నిస్తుండటం విశేషం. తనకు హిందీ సినిమాల్లో నటించాలని ఉందని మనసులో మాట బయటపెట్టాడు ఆండ్రూ. కుదిరితే ఇక్కడ విలన్ పాత్రలు చేయాలన్నది తన ఉద్దేశమన్నాడు. తనకు నటనపై ముందు నుంచే ఆసక్తి ఉందని.. కానీ ఫొటోగ్రఫీ అంటే మరింత ఎక్కువ ఇష్టం ఉండటం వల్ల అందులో కొనసాగుతున్నానని ఆండ్రూ చెప్పాడు. తనకు ఇండియాలో అత్యంత నచ్చిన నటి ఇలియానానే అని అతనన్నాడు. మరి ఆండ్రూకు సినిమాలపై ఉన్న ఆసక్తి గురించి ఇలియానాకు తెలియకుండా ఉండదు. ఇక్కడే అతడితో కలిసి సెటిలవ్వాలంటే అతడికీ అవకాశాలు ఇప్పించాలి. మరి ఈ ప్రయత్నంలో ఆమె ఏ మేరకు విజయవంతం అవుతుందో చూడాలి. ఐతే ఇలియానాకే అవకాశాలు అంతంతమాత్రంగా ఉంటే ఆండ్రూకు ఎవరు ఛాన్సులిస్తారన్నది ప్రశ్న.