సెల్ఫీలు దిగను.. ఏమైనా అనుకోండి

Update: 2015-07-27 04:42 GMT
టాలీవుడ్ వద్దనుకుని ఉత్తరాదికి వెళ్లిపోయింది ఇలియానా. మాతృభాష, సొంత ప్లేసు ఈ రెండిటి పై మమకారం పెంచుకుని హిందీ సినిమాల్లో నటిస్తోంది. ఇప్పటికే నాలుగైదు సినిమాల్లో నటించేసింది. బర్ఫీ, ఫటా పోస్టర్‌ నికలా హీరో, మై తేరా హీరో, హ్యాపీ ఎండింగ్‌.. ఇలా సినిమాలన్నీ రిలీజై ఇలియానాకు ఫ్లాప్స్ తెచ్హిపెట్టాయి

ఇక సినిమాల సంగతి ఎలా ఉన్నా కూడా..  నిన్నటివరకూ సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌ లు, ఫోటోగ్రాఫ్‌ లు అంటూ ట్విట్టర్‌, ఆన్‌లైన్‌ లో హడావుడి చేసేది. స్టార్‌ బక్స్‌ స్పాట్‌ లో ఎవరు కనిపించినా ఫోటోలు దిగి వాటిని ఆన్‌లైన్‌ లో ప్రచారానికి పెట్టేది. కానీ ఇక నుంచి అలా సెల్ఫీలు దిగే ఆసక్తి లేదని చెబుతోంది. ఓపిక నశించింది. ఇకనుంచి ఆ పనిచేయను.. అని చెప్పింది. ఐ జస్ట్‌ డోంట్‌ హావ్‌ ది బ్లడీ పేషెన్స్‌.. అని ట్వీట్‌ చేసింది ఇల్లూ. అభిమానులకు కాసింత నిరాశ కలిగించేదే అయినా సహనం కోల్పోయిన ఇలియానా వెంటపడితే సెల్ఫీ దక్కడం కష్టం. ఓ మంచి సెల్ఫీ దిగాలంటే కనీసం 15 నిమిషాలు సమయం వృధా అవుతోంది. అందుకే సహనం చచ్చిందని చెప్పింది ఇల్లూ. బాపురే..!
Tags:    

Similar News