ఇల్లీకి తెలుగులో చేయాలనుందట కానీ..

Update: 2018-02-25 17:36 GMT
తెలుగులో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుని మధ్యలో బాలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకున్న హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. ఐతే బాలీవుడ్‌కు అలా వెళ్లి మళ్లీ ఇలా తిరిగొచ్చి తెలుగులో సినిమాలు చేసిన వాళ్లే చాలామంది. ఐతే ఇలియానా మాత్రం అలా చేయలేదు. ఒకసారి హిందీ సినిమాలు చేయడం మొదలుపెట్టాక ఇటు వైపు చూడనే లేదు. మధ్యలో అవకాశాలు లేనపుడు కూడా దక్షిణాది సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించలేదు. పైగా తనకు హీరోయిన్‌గా తొలి అవకాశాన్నిచ్చి స్టార్ కావడానికి సాయపడ్డ ‘దేవదాసు’ దర్శకుడు వైవీఎస్ చౌదరి గురించి తేలిక చేసి మాట్లాడింది. ఈ విషయంలో చర్చ నడుస్తుండగానే మరోసారి టాలీవుడ్.. సౌత్ ఇండస్ట్రీ గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఇల్లీ బేబీ.

తనకు తెలుగులో - తమిళంలో మళ్లీ సినిమాలు చేయాలనే ఉంది కానీ.. తన గురించి దక్షిణాదిన కొంత కాలంగా ప్రతికూల ప్రచారం గట్టిగా జరుగుతోందని ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది. తాను డబ్బుల కోసమే సినిమాలు చేస్తానని అక్కడి వాళ్లు అనుకుంటున్నారని.. కానీ అది వాస్తవం కాదని ఆమె అంది. మంచి కథల కోసమే తాను ఎదురు చూస్తున్నానని.. దక్షిణాది నుంచి తనను ఎగ్జైట్ చేసే కథలు.. పాత్రలు వస్తే కచ్చితంగా అక్కడ మళ్లీ సినిమాలు చేస్తానని ఇలియానా స్పష్టం చేసింది. ఇక ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్‌ ఆండ్రూతో తన ప్రేమాయణం గురించి ఇలియానా స్పందిస్తూ.. ఇందులో దాచడానికేమీ లేదని - అతడితో తన బంధం ఏంటన్నది అందరికీ కనిపిస్తూనే ఉందని అంది.
Tags:    

Similar News