గోవా బ్యూటీ ఇలియానా పేరు తెలియదు అన్నారంటే దాదాపుగా వారు సినిమాలకు లక్ష కిలోమీటర్ల దూరంలో జీవనం సాగిస్తున్నారని వెంటనే మనం అర్థం చేసుకోవచ్చు. ఎన్నో బ్లాక్ బస్టర్ తెలుగు సినిమాల్లొ నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఈ భామ ఈమధ్య ఎక్కువగా బాలీవుడ్ పైనే ఫోకస్ చేస్తోంది. అయితే గత కొంతకాలంగా లాక్ డౌన్ పుణ్యమా అని ఇంటిపై ఎక్కువగా ఫోకస్ చేస్తోంది.
తాజాగా ఈ భామ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "నేను ఆ జీన్స్ లో ఎలా పట్టేదాన్నో అనుకుంటూ ఇలా చూస్తుంటాను. అప్పుడప్పుడు కంటనీరు కూడా వస్తుంది" అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చింది. నిజమే మనం కొంచెం బరువు పెరిగితే చాలు.. చాలా డ్రెస్సులు పట్టవు. అప్పుడు ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుని మరీ 'ఆ రోజుల్లో..' అనుకుంటూ ఎక్కడికో వెళ్లిపోతాం. ఇప్పటి పరిస్థితి తలుచుకుని కాస్త బాధపడతాం. "మనం ఎలాగైనా ఉండొచ్చు.. చూసేవాళ్లు చస్తారు.. మనకెందుకు" అనుకునే మరీ కర్కోటక మైన జనాలు తప్ప మిగతా వారు ఎవరైనా ఇల్లీ బేబీ మనసులోని ఫీలింగులను ఎంతో సహృదయంతో అర్థం చేసుకోగలరు.
ఇల్లీ ఫీలింగ్సు.. ఇంట్లో కూర్చుని ఇదంతా తెలుసుకునే మన ఫీలింగ్సు అన్నీ పక్కన పెట్టి ఫోటో గురించి మాట్లాడుకుంటే ఇల్లీ ఇంట్లోనే ఉంటూ ఎంత రంగు తేలిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక నెటిజన్ల స్పందన ఎలా ఉందంటే జస్ట్ ఫైర్ ఎమోజీలతో చంపేశారు. నిజానికి లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న కొందరు జఫ్ఫాలను శిక్షించడానికి ఈ ఫోటోకు వచ్చిన ఫైర్ ఎమోజిల సంఖ్యను లెక్క పెట్టమంటే చాలు. దెబ్బకు దెయ్యం వదులుతుంది. అయినా ఇల్లీ లో అంత ఫైర్ ఉందన్న సంగతి ఈ ఫోటో చూసిందాకా తెలియదేంటబ్బా! ఇక సినిమాల విషయానికి వస్తే ఇల్లీ ప్రస్తుతం కుకీ గులాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ది బిగ్ బుల్' అనే హిందీ సినిమాలో నటిస్తోంది.