నేను 'క్రష్'తో వస్తున్నా.. వాళ్లు ఇబ్బంది పడొచ్చు.. అది మోసం కాదు - రవిబాబు
ట్రైలర్ చూపించడం ద్వారా ప్రేక్షకుల్లో ఒక రకమైన ఫీలింగ్ క్రియేట్ చేస్తారు.. థియేటర్ కు వెళ్లి సినిమా చూస్తే.. అక్కడ కథ వేరే ఉంటది. చాలా వరకు సినిమాలు ఇలాగే ఉంటాయి. అయితే.. తన సినిమా మాత్రం ఆ కోవకు చెందినది కాదు అంటున్నారు నటుడినుంచి దర్శకుడిగా మారిన రవిబాబు.
అల్లరి, నచ్చావులే, మనసారా, అవును... ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను రూపొందించిన రవిబాబు.. చాలా కాలం గ్యాప్ తర్వాత మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 'క్రష్' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ముందుగానే రివీల్ చేస్తున్నాడీ దర్శకుడు. తన సినిమా కేవలం పెద్దల కోసమేనని, కుటుంబ ప్రేక్షకులు కాస్త ఇబ్బంది పడొచ్చు అని క్లియర్ కట్ గా చెప్పేస్తున్నారు రవిబాబు.
తన 'క్రష్' మరో ప్రయోగం లాంటిదన్న దర్శకుడు.. 18 నుంచి 35 మధ్య సంవత్సరాల వయసున్న ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని దీన్ని తెరకెక్కిస్తున్నట్టు చెప్పారు. ట్రైలర్ లో సింపుల్ రొమాన్స్ చూపించి, ప్రేక్షకులను మోసం చేయడం తనకు ఇష్టం లేదని చాటి చెప్తున్నారు రవిబాబు. అయితే.. చాలా సినిమాల్లో టీజర్ కు, సినిమాకు పొంతన ఉండకపోవచ్చని చెప్పిన ఆయన.. అది మోసం కాదని, మిస్ ఇన్ఫర్మేషన్ అని చెప్పారు. అయితే.. తాను మాత్రం క్లియర్ గా చెప్పేస్తున్నానని అంటున్నారు.
ఇక, గతంలో మహిళలపై తన తండ్రి చలపతి రావు వ్యాఖ్యలపైనా రవిబాబు స్పందించారు. ఆ వ్యాఖ్యలు నిజంగా చాలా మందిని బాధించాయన్న ఆయన.. వాటిని సమర్థించడానికి తాను సిద్ధంగా లేనన్నారు. ఆ వ్యాఖ్యల వెనుక ఉద్దేశంతో సంబంధం లేకుండా క్షమాపణలు చెప్పాల్సిందేనని తన తండ్రికి సూచించినట్టు రవిబాబు తెలిపారు.