ఆలియా ను మిస్ అవుతున్న మహేష్

Update: 2017-01-20 05:06 GMT
బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఆలియా భట్ రీసెంట్ గా కొత్తిల్లు కొనుక్కుని మకాం మార్చేసిన సంగతి తెలిసిందే. తన టేస్ట్ ప్రకారం డిజైన్ చేయించుకున్న ఇంటినుంచి ఫోటోలు కూడా తీసి పోస్ట్ చేసింది ఆలియా. ఆమె తన సోదరి షహీన్ భట్ తో కలిసి కొత్తింట్లో మకాం పెట్టింది. అయితే తన చిన్న కూతురు ఆలియా భట్ ఇంట్లో లేకపోవడంతో ఆమెను తెగ మిస్ అవుతున్నాడు తండ్రి మహేష్ భట్.

'నా గారాల పట్టి ఇంట్లో లేకపోవడం నాకు ఓ వ్యాధిలా మారిపోయింది. నేను తనని చాలా మిస్ అవుతున్నాను. తన ఇంటిని ఫెయిరీ ల్యాండ్ అంటూ ఉంటాను. పొద్దునే లేచినపుడు తను కనిపించకపోవడం లోటుగా ఉంది. నేను ఆమెకు మెసేజ్ చేసినప్పుడల్లా తనను ఎంతలా మిస్ అవుతున్నాననే రాస్తూ ఉంటాను. ఇదే నాకు బెస్ట్ డాడీ అని రిప్లై ఇస్తూ ఉంటుంది. బహుశా తను ఇంట్లో నుంచి వెళ్లడం నాపై చాలా ప్రభావం చూపినట్లుంది' అని చెబుతున్న మహేష్ భట్.

ఓ వారం క్రితం ఆలియా సెల్ఫీ తీసుకుంటున్న ఆలియా పోస్టర్ ముందు నుంచుని.. తండ్రి మహేష్ భట్ సెల్ఫీ తీసుకుంటున్న పిక్చర్.. ఆన్ లైన్ లో తెగ షేర్ అయిపోయింది. తను ఎంత పెద్ద దర్శకుడు అయినా.. కూతురు ఎంత క్రేజ్ ఉన్న హీరోయిన్ అయినా.. నాన్న ఎపుడూ నాన్నే కదా. కూతురుతో కలిసి ఒక ఇంట్లో ఉండలేకపోవడం బాధ కలిగించేదే.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News