తమిళ్ స్టార్ విజయ్ హీరోగా తెరకెక్కిన్న లేటెస్ట్ మూవీ ‘మాస్టర్’. లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. పాన్ ఇండియన్ మూవీగా విడుదలకు సిద్ధమైన ఈ చిత్రానికి తమిళనాట కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి.
కరోనా, లాక్ డౌన్ కారణంగా చిత్ర పరిశ్రమ ఆర్థికంగా చాలా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయ్ లాంటి పెద్ద హీరో సినిమా విజయవంతంగా థియేటర్లలో ఆడితేనే తమకు మేలు జరుగుతుందని డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు భావిస్తున్నారు. అయితే.. 50శాతం ఆక్యుపెన్సీతో అయితే ఉపయోగం ఉండదని, ఈ సినిమాకు 100 శాతం ఆక్యుపెన్సీ అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ విన్నపానికి రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పేసింది. 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇచ్చేసింది. ఈ నిర్ణయంతో సినీ ఇండస్ట్రీ, అభిమానులు ఆనందపడుతుండగా.. అక్కడి విపక్షాలు మాత్రం ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. కరోనా స్ట్రెయిన్ పెరుగుతున్న ఈ తరుణంలో ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నాయి. ఒక్క సినిమాకు అనుమతి ఇస్తే.. మిగిలిన సినిమాలకు కూడా ఇవ్వాల్సి వస్తుందని అంటున్నాయి. దీంతో.. ప్రభుత్వం పునరాలోచనలో ఏమైనా పడుతుందా? అనే ఆందోళన ఇటు అభిమానులను, అటు ‘మాస్టర్’ టీమ్ ను వేధిస్తోంది.
అయితే.. ఇప్పటికే అనుమతులు వచ్చేసాయి కాబట్టి సినిమా అలానే విడుదల అయ్యే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. అదే జరిగితే.. ఇతర సినిమాలు కూడా అదేవిధంగా విడుదల అయ్యే అవకాశం ఉంది. మరి.. పొలిటికల్ ఇష్యూగా మారిన ఈ వ్యవహారం ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి. కాగా.. జనవరి 13న ఈ చిత్రం తెలుగులో కూడా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇక్కడ మాత్రం 50 శాతం ఆక్యుపెన్సీతోనే రిలీజ్ అవుతుంది.